సెప్టెంబర్ నెలలో రెండు సార్లు ఏకాదశి తిధి.. సర్వ పాపాలు నశించి పూర్వీకుల ఆశీస్సుల కోసం ఎలా పూజ చేయాలంటే

ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో పాటించడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఏకాదశి ఉపవాసం పాటించే వారికి మతపరమైన దృక్కోణంలో సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో రెండు ముఖ్యమైన ఏకాదశి తిధిలు వచ్చాయి.

సెప్టెంబర్ నెలలో రెండు సార్లు ఏకాదశి తిధి.. సర్వ పాపాలు నశించి పూర్వీకుల ఆశీస్సుల కోసం ఎలా పూజ చేయాలంటే
Ekadashi 2024
Follow us

|

Updated on: Sep 05, 2024 | 8:03 PM

హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిధికి ఉపవాసం, పూజలకు ప్రసిద్ధి చెందింది. ఏకాదశి శ్రీ మహా విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున గొప్ప భక్తితో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. నమ్మకం ప్రకారం ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో పాటించడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఏకాదశి ఉపవాసం పాటించే వారికి మతపరమైన దృక్కోణంలో సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో రెండు ముఖ్యమైన ఏకాదశి తిధిలు వచ్చాయి.

పరివర్తిని ఏకాదశి 2024

పరివర్తినీ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున మహావిష్ణువును ధ్యానించడం, పూజించడం వల్ల సర్వపాపాలనుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. పరివర్తిని ఏకాదశి ఉపవాసం 14 సెప్టెంబర్ 2024 శనివారం నాడు ఆచరించబడుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15న ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంటుంది.

ఇందిరా ఏకాదశి 2024

ఇందిరా ఏకాదశి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ప్రధాన ఏకాదశి. ఈ రోజున చేసే ఉపవాసం పూర్వీకుల శాంతికి, వారి ఆత్మల మోక్షానికి అంకితం చేయబడింది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో వచ్చే భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశితిధిని ఇందిర ఏకాదశిగా జరుపుకుంటారు. ఇందిరా ఏకాదశి వ్రతం 28 సెప్టెంబర్ 2024న పాటించబడుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్ 29న మళ్లీ ఉపవాసం విరమించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత

ఏకాదశి ఉపవాసం హిందూ మతంలో ముఖ్యమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతి నెల పదకొండవ రోజున పాటించబడుతుంది. ‘ఏకాదశి’ అంటే ‘పదకొండు. ఈ ఉపవాసం ముఖ్యంగా విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. మత విశ్వాసం ప్రకారం ఈ ఏకాదశి తిది రోజున ఉపవాసం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతాడు.

ముఖ్యంగా మోహినీ ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగినీ ఏకాదశి, కామికా ఏకాదశి వంటి అనేక రకాల ఏకాదశి తిది ఉపవాసాలు ఉన్నాయి. ఇవి దేనికదే విశిష్టత కలిగి ఉన్నాయి. అంతేకాదు విభిన్న ప్రాముఖ్యత, పూజా విధానాలు ఉన్నాయి. చంద్ర గమనం ప్రకారం ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి తిది వస్తుంది. ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి ఉపవాసాలు చేస్తారు. అంటే సంవత్సరం మొత్తం 24 ఏకాదశి ఉపవాసాలు చేస్తారు.

చాలా మంది ఉపవాస సమయంలో ఆహారం,నీరు తీసుకోరు. ఉపవాసం పాటించే ప్రజలు రోజంతా విష్ణువు మంత్రాలను పఠిస్తూ భజనలు, కీర్తనలతో గడుపుతారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయడం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుంది, దీనివల్ల పుణ్యం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి