Baby Care: మానవ పాల ఫోర్టిఫైయర్ అంటే ఏమిటి? ఏ పరిస్థితిలో నవజాత శిశివులకు దీనిని ఇస్తారంటే
గుర్గావ్ లోని మదర్‌హుడ్ హాస్పిటల్ కి చెందిన MBBS, MD (పీడియాట్రిక్స్), DM (నియోనాటాలజీ), మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ వజీర్ నవజాత శిశివుల గురించి పోషకాహారం గురించి అనేక విషయాలను చెప్పారు. ముఖ్యంగా నెలలు నిండకుండా జన్మించిన లేదా 1500 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న శిశువులకు హ్యూమన్ మిల్క్ ఫోర్టిఫైయర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంజయ్ వజీర్ చెప్పారు. ఇటువంటి శిశువులకు తల్లి పాలతో పాటు సాధారణంగా ఎక్కువ పోషకాహారం అవసరం.
తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానం. మొదటి ఆరు నెలలు తల్లి పాలు శిశివుకి తప్పనిసరిగా ఇవ్వాలి. తల్లి పాలు పిల్లల సమగ్ర అభివృద్ధికి దారితీస్తుంది. అయితే కొంత మంది శిశివులకు ఎక్కువ పోషకాహారం అవసరం అవుతుంది. అటువంటి నవజాత శిశువులకు మానవ పాలు ఫోర్టిఫైయర్ అవసరం. నిజానికి.. ఇవి తల్లి పాలలో లేదా ఆవు పాలలో కలిపిన ఒక ప్రత్యేక పోషకం. దీంతో బిడ్డకు అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం తదితర పోషకాలు అందుతాయి.
గుర్గావ్ లోని మదర్‌హుడ్ హాస్పిటల్ కి చెందిన MBBS, MD (పీడియాట్రిక్స్), DM (నియోనాటాలజీ), మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ వజీర్ నవజాత శిశివుల గురించి పోషకాహారం గురించి అనేక విషయాలను చెప్పారు. ముఖ్యంగా నెలలు నిండకుండా జన్మించిన లేదా 1500 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న శిశువులకు హ్యూమన్ మిల్క్ ఫోర్టిఫైయర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంజయ్ వజీర్ చెప్పారు. ఇటువంటి శిశువులకు తల్లి పాలతో పాటు సాధారణంగా ఎక్కువ పోషకాహారం అవసరం.
తల్లి పాలు బిడ్డకు పోషకాహారం, రక్షణను అందజేస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే కొన్నిసార్లు నెలలు నిండని శిశువులకు తల్లి పాల నుంచి కావలసినంత ప్రోటీన్, కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్ని అవసరమైన పోషకాలు అందవు. అప్పుడు ఈ లోపాన్ని ఫోర్టిఫైయర్ తీరుస్తుంది.
శిశువు అభివృద్ధి
బరువు తక్కువగా జన్మించిన పిల్లలకు ఈ పోషకాలను నిలకడగా ఇచ్చినప్పుడు బరువు, ఎత్తు, తల పరిమాణం బాగా పెరుగుతుంది. శిశువు మొత్తం శారీరక అభివృద్ధికి అవసరమైన అదనపు పోషణను అందిస్తుంది.
ఎముకలకు అవసరమైన ఖనిజాలు
నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు క్యాల్షియం, ఫాస్పరస్ లోపం వల్ల ఎముకల సమస్యలు రావచ్చు. హ్యూమన్ మిల్క్ ఫోర్టిఫైయర్ ఈ ముఖ్యమైన ఖనిజాల మొత్తాన్ని శిశివులో పెంచుతుంది. తద్వారా శిశువు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
పిల్లల మానసిక అభివృద్ధి
సరైన పోషకాహారాన్ని అందించడంతో పాటు, ఈ పోషకాలు పిల్లలను మేధో స్థాయిని అభివృద్ధి చేస్తాయి. నాడీ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఉండే అదనపు పోషకాలు శిశువు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీనివల్ల నవజాత శిశివుకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి తరచుగా అనారోగ్యం బారిన పడడు.
నిపుణులు చాలా మంది మానవ పాల బలవర్ధకాలను ఆవు పాలతో తయారు చేస్తున్నారు. అయితే ఇది కొన్ని సంభావ్య సమస్యలను కలిగిస్తుంది. కొంతమంది పిల్లలకు ఆవు పాలు అంటే అలెర్జీ ఉండవచ్చు లేదా ప్రేగులలో మంట ఉండవచ్చు. కనుక ఇలా బరువు తక్కువగా పుట్టిన శిశివులకు లేదా నెలలు నిండకుండా జన్మించిన శిశివులకు మానవ పాలతో తయారు చేసిన ఫోర్టిఫైయర్ మంచి ఉపయోగమైన ఆహారం. ఇది శిశువుకు జీర్ణం అవ్వడం లో ఎక్కువ ఇబ్బంది లేదని పరిశోధనలో తేలింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Note: పైన తెలిపిన విసయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.