Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye care Tips: స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారా.. కంటి చూపు మెరుగుపడడం కోసం ఈ చిట్కాలు పాటించి చూడండి

దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడమే కాదు కంటి చూపు మెరుగుపడుతుంది. అటువంటి పరిస్థితిలో పిల్లలు కూడా ఎప్పుడు చూసినా వివిధ రకాల గాడ్జెట్‌లతో ఆడుకుంటూ ఉంటున్నారు. దీంతో పిల్లల కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో విటమిన్ ఎ, డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చెందిన కంటి నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ చెబుతున్నారు.

Eye care Tips: స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారా.. కంటి చూపు మెరుగుపడడం కోసం ఈ చిట్కాలు పాటించి చూడండి
Eye Care TipsImage Credit source: Getty Images Plus
Surya Kala
|

Updated on: Sep 05, 2024 | 5:24 PM

Share

డిజిటల్ ప్రపంచంలో కంటి ఆరోగ్యం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అతి పెద్ద కారణం ఏమిటంటే.. గంటల తరబడి స్క్రీన్‌పై చూస్తూ ఉండటం. దీని వలన కంటిపై ఒత్తిడి, కళ్ళ అలసటను పెంచుతుంది. అయితే రోజువారీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడమే కాదు కంటి చూపు మెరుగుపడుతుంది. అటువంటి పరిస్థితిలో పిల్లలు కూడా ఎప్పుడు చూసినా వివిధ రకాల గాడ్జెట్‌లతో ఆడుకుంటూ ఉంటున్నారు. దీంతో పిల్లల కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఆహారంలో విటమిన్ ఎ, డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చెందిన కంటి నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ చెబుతున్నారు. దృష్టి చెడిపోవడానికి యూవీ కిరణాలు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో UVA, UVB కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ధరించడం చాలా ముఖ్యం. కళ్లను ఎలా సంరక్షించుకోవాలో నిపుణులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం?

20-20-20 నియమాన్ని అనుసరించండి

కంటి అలసటను నివారించడానికి ప్రతి 20 నిమిషాలకు 20-20-20 నియమాన్ని అనుసరించాలి. 20 సెకన్ల విరామం తీసుకోండి. 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉండే కండరాలు కూడా ఉపశమనం పొందుతాయి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన ఆహారం

కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారాన్ని సరిగ్గా అనుసరించండి. విటమిన్ ఏ కళ్లకు చాలా మేలు చేస్తుంది. క్యారెట్, బచ్చలికూర, డ్రై ఫ్రూట్స్, సిట్రస్ పండ్లు, గుడ్లు, చేపలను మీ ఆహారంలో చేర్చుకోండి.

రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోండి

అంతేకాదు కంటి నిపుణుడిచే రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోండి. కళ్ళను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకుంటే.. దృష్టి సమస్యలను తగ్గించవచ్చు. పిల్లలు మరీ దగ్గరగా టీవీ లేదా మొబైల్ చూస్తున్నా.. లేదా తలనొప్పితో తరచుగా ఇబ్బంది పడుతుంటే ఇవి కళ్ల బలహీనతకు సంకేతాలు అని నిపుణులు అంటున్నారు.

అయితే నిపుణులు చెప్పిన ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కళ్ళను జాగ్రత్తగా చూసుకోవచ్చు. దీంతో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విసయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.