Lifestyle: అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి నీళ్లు.. ఎలా ఉపయోగించాలంటే..

కొబ్బరి నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా వీటిని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది చర్మంపై మొటిమలతో పాటు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ సమస్య కూడా మాయమవుతుంది...

Lifestyle: అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి నీళ్లు.. ఎలా ఉపయోగించాలంటే..
Coconut Water
Follow us

|

Updated on: Sep 05, 2024 | 5:19 PM

కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో నిత్యం హైడ్రేట్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వేసవిలో కచ్చితంగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. శరీరంలో శక్తి స్థాయిలను మెయింటెన్‌ చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగపడుతాయి. అయితే కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగడతాయని మీకు తెలుసా.? ఇంతకీ కొబ్బరి నీళ్లను అందాన్ని పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా వీటిని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది చర్మంపై మొటిమలతో పాటు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ సమస్య కూడా మాయమవుతుంది. కొబ్బరి నీటిలోని విటమిన్ సి కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీటిలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి కాపాడుతుంది.

కొబ్బరి నీళ్లను ముఖానికి పట్టించడం ద్వారా చర్మానికి యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇది ముఖంపై ఉన్న ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. కొబ్బరి నీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉండే దుమ్ము కణాలను శుభ్రపరచడం ద్వారా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో, రోజ్‌ వాటర్‌తో పాటు.. రైస్ వాటర్ మిక్స్ చేసి కాటన్ సహాయంతో చర్మానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.

అలోవెరా జెల్‌, ముల్తానీ మట్టిలో కొబ్బరి నీళ్లను కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం సహజంగా మారుతుంది. కొబ్బరి నీళ్లలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మేకప్‌ను సహజంగా తొలగించుకోవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంతోపాటు, సహజ కాంతిని కాపాడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..