నీటిని కలుషితం చేస్తున్నందున POP గణేశ విగ్రహాల అమ్మకాలను BBMP నిషేధించింది. దీంతో పర్యావరణహిత మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరిగి మట్టి కొరతతో మట్టి విగ్రహాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ఏడాది కాగితపు విగ్రహాలకు గిరాకీ పెరిగింది. ఈ విగ్రహాలు బెంగళూరు నగరంలో పలుచోట్ల ట్రినిటీ సర్కిల్, యశవంత్‌పూర్, బసవనగుడి, కంటోన్మెంట్ తదితర చోట్ల అందుబాటులో ఉన్నాయి.