- Telugu News Photo Gallery Doing Vinayaka Chavithi at this time will bring good luck, Check Here is Details in Telugu
Ganesh Chaturthi 2024: వినాయక చవితిని ఈ సమయంలో చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది..
వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ అంటే శనివారం వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి పండుగ కోసం ఏడాది పొడవునా వెయిట్ చేస్తూ ఉంటారు. దేశం అంతా ఒక్కటై ఎంతో ఆర్భాటంగా వినాయకుడిని కొలుస్తారు. ఏ వీధుల్లో.. వాడల్లో చూసినా గణేష్ మండపాలే దర్శనమిస్తాయి. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో గణపయ్యను కొలుస్తారు. అంగ రంగ వైభవంగా జరిగే వినాయకుడి ఉత్సవాలను..
Updated on: Sep 05, 2024 | 1:58 PM

వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ అంటే శనివారం వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి పండుగ కోసం ఏడాది పొడవునా వెయిట్ చేస్తూ ఉంటారు. దేశం అంతా ఒక్కటై ఎంతో ఆర్భాటంగా వినాయకుడిని కొలుస్తారు. ఏ వీధుల్లో.. వాడల్లో చూసినా గణేష్ మండపాలే దర్శనమిస్తాయి.

చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో గణపయ్యను కొలుస్తారు. అంగ రంగ వైభవంగా జరిగే వినాయకుడి ఉత్సవాలను జరిపిస్తారు. అయితే వినాయక వ్రతము ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. మంచి శుభ ముహూర్తంలోనే చేస్తే ఆ గణనాథుని ఆశీస్సులు మనకు లభిస్తాయి.

ధృక్ పంచాంగం ప్రకారం వినాయక వ్రతము చేసుకోవడానికి మంచి శుభ ముహూర్తాలే ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఉదయం 11:03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు వినాయక చవితి పూజ చేసుకోవచ్చు.

సాయంత్రం 6:22 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే ఎరుపు రంగు దుస్తులు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే మరింత అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

అలాగే వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం పెట్టడం వల్ల మరింత విశేషంగా కలిసి వస్తుందట. వినాయకుడికి ఇదే రోజు గరికతో తయారు చేసిన మాల వేస్తే చాలా మంచిదని, ఆర్థిక కష్టాలు తొలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




