Earthen vessels: కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..

ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మేరకు అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. వంటగదిలో ఉపయోగించే పాత్రలను మార్చేస్తున్నారు. ఎక్కువగా మట్టి పాత్రలను కొనుగోలు చేస్తున్నారు. పాత కాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్లీ ఇప్పుడు వీటిని వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మట్టి పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా..

Earthen vessels: కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
Earthen Vessels
Follow us

|

Updated on: May 07, 2024 | 6:13 PM

ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మేరకు అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. వంటగదిలో ఉపయోగించే పాత్రలను మార్చేస్తున్నారు. ఎక్కువగా మట్టి పాత్రలను కొనుగోలు చేస్తున్నారు. పాత కాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్లీ ఇప్పుడు వీటిని వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మట్టి పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వాటిని ఎలా యూజ్ చేస్తున్నారన్నది కూడా ముఖ్యమే. మట్టి పాత్రల్లో వండిన ఆహారాలు రుచితో ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిల్లో తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అయితే మట్టి పాత్రలను మొదటి సారి కొనేవారు, వండే వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దాని ప్రయోజనాలు తీసుకోవాలి.

కాటన్ క్లాత్‌తో శుభ్రం చేయాలి:

మార్కెట్ నుంచి మట్టి పాత్రలను నేరుగా వండకూడదు. వాటిల్లో నీరు పోసి తాగకూడదు. ముందుగా కాటన్ క్లాత్ తీసుకుని.. శుభ్రంగా తుడవాలి. కాటన్ క్లాత్‌తో తుడవడం వల్ల కుండకు అంటుకున్న తుమ్ము తొలగిపోతుంది.

24 గంటలు నీటితో నానబెట్టాలి:

మట్టి కుండ బలంగా ఉండాలంటే.. శుభ్రమైన కాటన్ గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత నీటితో మట్టి పాత్రలను నిండగా నింపేయాలి. ఇలా రెండు రోజులు.. 24 గంటలు చేయాలి. ఇలా నానబెట్టడం వల్ల మట్టి పాత్రలు బలంగా ఉండటమే కాకుండా.. త్వరగా విరిగి పోకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మురికిని స్క్రబ్బర్‌తో క్లీన్ చేయాలి:

మట్టి కుండను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. నీటిలో రెండు రోజుల వరకు నానబెట్టిన తర్వాత స్కబ్బర్‌తో మట్టి పాత్రలను క్లీన్ చేయాలి. దీని వల్ల కుండలోని మురికి శుభ్రపడుతుంది.

ఆయిల్:

స్క్రబ్బర్‌‌తో మట్టి పాత్రలను క్లీన్ చేసిన తర్వాత.. ఎండలో బాగా ఆరబెట్టాలి. మట్టి పాత్రలకు చుట్టూ ఆయిల్ రాయాలి. కుండ లోపల, బయట తుడవండి. ఆయిల్‌ని అప్లై చేయడం వల్ల పాత్రలు బలంగా ఉంటాయి.

గంజి నీరు వేయాలి:

మట్టి పాత్రలకు ఆయిల్ రాసిన తర్వాత.. బియ్యం కడిగిన నీళ్లు లేదంటే గంజి వేసి గ్యాస్ మీద పెట్టండి. ఇది బాగా మరిగిన తర్వాత ఒంపేసి.. మరోసారి కడిగి పక్కన పెట్టండి. అంతే ఇప్పుడు మట్టి పాత్రలు వంట చేసుకోవడానికి సిద్ధం అవుతాయి. మీరు ఎప్పుడు మట్టి పాత్రలు కొన్నా.. ఇలానే చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.