AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunscreen: సన్‌స్క్రీన్ అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందా? సైన్స్ రహస్యం ఇదే..

వేసవిలో ఎండల తీవ్రమైన వేడి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి 4-5 గంటలకు ఒకసారి ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు 50 SPF ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను పూయడం చాలా ముఖ్యం. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడమే కాకుండా, చర్మ తేమను కాపాడుతుంది. అయితే కొంతమంది..

Sunscreen: సన్‌స్క్రీన్ అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందా? సైన్స్ రహస్యం ఇదే..
Sunscreen
Srilakshmi C
|

Updated on: Apr 08, 2025 | 8:26 PM

Share

చర్మ సంరక్షణలో సన్‌స్క్రీన్ ఒక ముఖ్యమైన భాగం. ఇది సూర్యుని హానికరమైన UV కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి మహిలలే కాదు, పురుషులు కూడా రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. వేసవిలో ఎండల తీవ్రమైన వేడి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి 4-5 గంటలకు ఒకసారి ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు 50 SPF ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను పూయడం చాలా ముఖ్యం. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడమే కాకుండా, చర్మ తేమను కాపాడుతుంది. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. నిపుణులు కూడా సన్‌స్క్రీన్ వాడటం తప్పనిసరనే చెబుతున్నారు. అయినప్పటికీ కొంతమంది సన్‌స్క్రీన్ ఎక్కువగా అప్లై చేయడం వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

సన్‌స్క్రీన్ చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుందా?

సన్‌స్క్రీన్ వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ సన్‌స్క్రీన్ వాడకానికి, చర్మ క్యాన్సర్‌కు ఎటువంటి సంబంధం లేదని నిపుణులు అన్నారు. నిజానికి, సన్‌స్క్రీన్ చర్మానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇది అనేక రకాల చర్మ క్యాన్సర్‌కు కారణమయ్యే హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి, సన్‌స్క్రీన్ వాడటం చాలా అవసరం.

చర్మం రంగు ముదురు రంగులో ఉంటే సన్‌స్క్రీన్ రాసుకోవాల్సిన అవసరం లేదా?

కొంత మంది నల్లగా ఉండేవారు సన్‌స్క్రీన్ వేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ చర్మం రంగుతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ వినియోగించాలి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. హైపర్‌పిగ్మెంటేషన్, సన్‌బర్న్, చర్మ క్యాన్సర్‌ను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో సన్‌స్క్రీన్ అప్లై చేయవలసిన అవసరం లేదా?

వర్షాకాలం, మేఘావృతమైన వాతావరణంలో సూర్య కిరణాలు శరీరంపై ఎక్కువగా పడవు. కాబట్టి సన్‌స్క్రీన్ రాసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. అయితే, ఈ రోజుల్లో కూడా హానికరమైన UV కిరణాలు మేఘాల గుండా చొచ్చుకుపోయి చర్మాన్ని దెబ్బతీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మేఘావృతమైన రోజులలో కూడా సన్‌స్క్రీన్ తప్పనిసరి.

SPF ఉన్న మేకప్ సరిపోతుందా? వీరికి సన్‌స్క్రీన్ అవసరం లేదా?

నేటి కాలంలో చాలా ఫౌండేషన్లు, లేతరంగు గల మాయిశ్చరైజర్లు SPF తో వస్తున్నాయి. అందువల్ల చాలా మంది మేకప్ వేసుకునేటప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇది చర్మాన్ని రక్షించదు. చర్మ సంరక్షణకు సరైన సన్‌స్క్రీన్ అప్లై చేయడం చాలా అవసరం.

సన్‌స్క్రీన్ మన శరీరం విటమిన్ డి ని గ్రహించకుండా నిరోధిస్తుందా?

సన్‌స్క్రీన్ మన శరీరం సూర్య కిరణాల నుండి విటమిన్ డి ని గ్రహించకుండా నిరోధిస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ సన్‌స్క్రీన్ వాడినప్పటికీ తగినంత మొత్తంలో విటమిన్ డిని సూర్యుని నుంచి గ్రహించగలవు. తక్కువ మొత్తంలో సూర్యకాంతికి గురికావడం ద్వారా శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఆహారం లేదా ఇతర సప్లిమెంట్ల ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.