Black Carrots: నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ తీవ్రమైన వ్యాధులు పరార్..
బ్లాక్ క్యారెట్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. తీవ్రమైన వ్యాధులు నల్ల క్యారెట్ తినడంతో నయం చేసుకోవచ్చు. నల్ల క్యారెట్లలో ఆంథోసయనిన్ అనే పదార్థం ఉండటంవల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ ఆంథోసయనినే మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని ఇస్తుంది. సాధారణ క్యారెట్లలో మాదిరిగానే నల్ల క్యారెట్‌లలోనూ బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
నల్ల క్యారెట్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతాయి. నల్ల క్యారెట్లు తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది. చాలామందిని రుమటాయిడ్ ఆర్ధరైటిస్ సమస్య వేధిస్తుంటుంది. నల్ల క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఈ సమస్యకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నల్ల క్యారెట్లను తినడం అలవాటు చేసుకుంటే పరిష్కారం లభిస్తుంది. నల్ల క్యారెట్లు అల్జీమర్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
బ్లాక్ క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపడేలా చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి బ్లాక్ క్యారెట్ గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది. బరువు తగ్గుతారు. నల్ల క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది. చర్మంపై ముడతలు తగ్గి ముఖం అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. బ్లాక్ క్యారెట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెకు కూడా మంచిది. బ్లాక్ క్యారెట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుందని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
బ్లాక్ క్యారెట్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. తీవ్రమైన వ్యాధులు నల్ల క్యారెట్ తినడంతో నయం చేసుకోవచ్చు. నల్ల క్యారెట్లలో ఆంథోసయనిన్ అనే పదార్థం ఉండటంవల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ ఆంథోసయనినే మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని ఇస్తుంది. సాధారణ క్యారెట్లలో మాదిరిగానే నల్ల క్యారెట్‌లలోనూ బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..