AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..

ఇంట్లోకి ప్రవేశించిన చిరుత, కుక్కను పట్టుకోవడానికి యత్నించింది. అయితే కుక్కు దాని నుంచి తప్పించుకుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డవగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఇంటి ప్రాంగణాన్ని పరిశీలించారు. అదే కారణంతో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రంహోమ్‌ కేటాయించారు. అలాగే మైసూర్‌లోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో ఒకరి చుట్టూ ఒకరు తిరగకూడదని కూడా ఆదేశాలు అందాయి.

Watch: ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
A Leopard Entered The House
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2025 | 1:28 PM

Share

కర్ణాటకలో షిర్సి తాలూకాలోని కాగేరి గ్రామంలోని ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే ఇంటి ఆవరణలో చిరుత పులి కలకలం రేపింది.ఇంట్లోకి ప్రవేశించిన చిరుత, కుక్కను పట్టుకోవడానికి యత్నించింది. అయితే కుక్కు దాని నుంచి తప్పించుకుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డవగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఇంటి ప్రాంగణాన్ని పరిశీలించారు. షిర్సి తాలూకా పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చిరుతలు దర్శనమివ్వడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మైసూరులోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో గత 10 రోజులుగా చిరుతపులిని గుర్తించే ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అదే కారణంతో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రంహోమ్‌ కేటాయించారు. అలాగే మైసూర్‌లోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో ఒకరి చుట్టూ ఒకరు తిరగకూడదని కూడా ఆదేశాలు అందాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..