బైంసా వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. రాజస్థానీ ఘేవర్ స్వీట్.. ఎంతో ఫేమస్

ఈ గేవర్ సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి ప్రాంత ప్రజలు ఈ మిఠాయిని తినని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు. అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చి మరి ఈ మిఠాయిని తయారు చేసి దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు పంపిస్తారు. స్వీట్ హోమ్ యజమాని బాలాజీ గోపాల్ మాట్లాడుతూ ఈ గేవర్ను నాలుగు రకాలుగా తయారు చేస్తామని అందులో ప్రత్యేకంగా మలైగేవర్ తయారు చేస్తామని అంటున్నారు.

బైంసా వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. రాజస్థానీ ఘేవర్ స్వీట్.. ఎంతో ఫేమస్
Ghevar Sweet
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 14, 2025 | 12:37 PM

ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కు పూతరేకులు, కాకినాడకు కాజాలు అలాగే నిర్మల్ జిల్లా బైంసాలో దొరికే గేవర్ (రాజస్థాని స్వీట్ ) కు అంతే ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సమయంలో మాత్రమే దొరికే ఈ గేవర్ మహారాష్ట్ర, గుజరాత్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా అమెరికా ,దుబాయ్ వంటి దేశాలకు సైతం ఈ గేవర్ను తీసుకెళ్తారు. అంతర్జాతీయంగా పేరేందిన బైంసా గేవర్ స్వీట్ పై బి ఆర్ కే ప్రత్యేక కథనం. రాష్ట్రంలో ఎక్కడ కనిపించని రాజస్థానీ స్వీట్ అయిన గేవర్ బైంసా పట్టణంలో మాత్రమే ప్రత్యేకంగా తయారు చేస్తారు.

కేవలం సంక్రాంతి సమయంలో మాత్రమే ఈ స్పెషల్ స్వీట్ తయారుచేసి విక్రయిస్తారు. ఈ గేవర్ సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి ప్రాంత ప్రజలు ఈ మిఠాయిని తినని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు. అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చి మరి ఈ మిఠాయిని తయారు చేసి దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు పంపిస్తారు.

స్వీట్ హోమ్ యజమాని బాలాజీ గోపాల్ మాట్లాడుతూ ఈ గేవర్ను నాలుగు రకాలుగా తయారు చేస్తామని అందులో ప్రత్యేకంగా మలైగేవర్ తయారు చేస్తామని అన్నారు .కేవలం సంక్రాంతి నుంచి నెల రోజులు మాత్రమే తయారుచేసి విక్రయిస్తామని వెల్లడించారు. ఈ గేవర్ను తినేందుకు సంవత్సర కాలం పాటు వేచి ఉంటామని కస్టమర్లు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మైదా,పాల తో తయారు చేసే ఈ గేవర్ చాలా రుచికరంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు పెద్దలు రుచికరంగా తింటారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ బైంసాలో సంక్రాంతికి స్పెషల్ గా గేవర్ స్వీట్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..