Hair Care: జుట్టు ఊడిపోకూడదంటే.. నూనె ఎలా ఉపయోగించాలో తెలుసా?

జుట్టు అంటే అందరికీ ఇష్టమే. అబ్బాయిలు, అమ్మాయిలు జుట్టును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. జుట్టు వల్లనే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాంటి జుట్టు రాలిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మగవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే బట్టతల వచ్చే ఛాన్స్ వీరికే ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలని..

Hair Care: జుట్టు ఊడిపోకూడదంటే.. నూనె ఎలా ఉపయోగించాలో తెలుసా?
Hair Care
Follow us

|

Updated on: Jun 27, 2024 | 3:35 PM

జుట్టు అంటే అందరికీ ఇష్టమే. అబ్బాయిలు, అమ్మాయిలు జుట్టును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. జుట్టు వల్లనే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాంటి జుట్టు రాలిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మగవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే బట్టతల వచ్చే ఛాన్స్ వీరికే ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలని అందరూ అనుకుంటారు. ఇందు కోసం మార్కెట్లో లభించే అన్ని నూనెలను, షాంపూలను ఉపయోగిస్తారు. కానీ అసలు తలకు నూనెను ఎలా అప్లై చేస్తున్నారన్నదే పాయింట్. నూనె తలకు అప్లై చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరి జుట్టుకు నూనె ఎలా పెడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

విపరీతంగా రాయకండి:

చాలా మంది జుట్టుకు ఆయిల్‌ని మరీ విపరీతంగా రాసేస్తారు. అలా రాయకూడదు. సరిపడినంత మాత్రమే పట్టించాలి. ఇలా రాత్రి పూట ఎక్కువగా ఆయిల్ రాసి నిద్రపోతే.. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మీ జుట్టు పొడవు, ఒత్తు ప్రకారం మాత్రమే నూనె రాయండి.

రబ్ చేయకండి:

తలపై నూనె పట్టించాక చాలా మంది గట్టిగా రబ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. కేవలం సున్నితంగా మాత్రమే మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. జుట్టు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గట్టిగా ముడి వేయకండి:

ఆయిల్ పెట్టాక.. చాలా మంది చేసే మరో తప్పు ఇదే. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది అనుకుంటారు. కానీ రాలిపోతుందన్న విషయం తెలీదు. జుట్టుకు నూనె రాసిన తర్వాత సున్నితంగా మాత్రమే జుట్టును ముడివేయాలి.

తేలికగా ఉండే ఆయిల్ రాయండి:

చాలా మంది జుట్టుకు ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ జుట్టుకు ఏ ఆయిల్ పడుతుందో.. దాన్ని ఒక్కటే రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

రాత్రి పూట ఇలా చేయండి:

చాలా మంది రాత్రి పూట ఆయిల్ తలకు పెడుతూ ఉంటారు. కొంత మంది వేడి చేసి తలకు రాస్తూ ఉంటారు. ఇలా రాత్రి పూట తలకు వేడి చేసిన నూనె రాయకూడదు. దీని వల్ల చెమటలు బాగా పట్టి.. తలపై నుంచి చెమటలు కారతాయి. దీంతో చర్మ సమస్యలు తలెత్తుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..