8 Shape Walking Uses: ఈ ఆకారంలో మీరు వాకింగ్ చేస్తే.. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు!

వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి వీలును బట్టి ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల చర్మ కాంతి పెరగడంతో పాటు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికే వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల ఫిట్ నెస్ కూడా పెరుగుతుంది. ఇలా ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల ఒక్కటేంటి...

8 Shape Walking Uses: ఈ ఆకారంలో మీరు వాకింగ్ చేస్తే.. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు!
8 Shape Walking Uses
Follow us

|

Updated on: Jun 27, 2024 | 3:17 PM

వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి వీలును బట్టి ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల చర్మ కాంతి పెరగడంతో పాటు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికే వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల ఫిట్ నెస్ కూడా పెరుగుతుంది. ఇలా ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల ఒక్కటేంటి.. అనేక లాభాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పే షేప్‌లో నడిస్తే మరింత రెట్టింపు లాభాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే 8 షేప్ వాకింగ్. దీన్ని ఇన్ఫినిటీ వాక్ అని కూడా అంటారు. మరి ఇలా వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిట్ లాస్:

ఈ 8 నెంబర్ ఆకారంలో నడవటం వల్ల.. త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ షేప్‌లో నడవటం వల్ల శరీరంలోని అన్ని భాగాలూ, కండరాలు కదులుతాయి. దీంతో కొవ్వు అనేది ఈజీగా కరగుతుంది. కాబట్టి తక్కువ సమయంలోనే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.

బీపీ కంట్రోల్:

బీపీ ఉన్నవాళ్లు ఈ ఆకారంలో నడవడం వల్ల.. రక్త పోటు కంట్రోల్‌లో ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ ఆకారంలో నడవటం వల్ల గుండె మీద భారం తగ్గుతుందట. ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కండరాలు ఎక్కువగా కదులుతాయి:

తిన్నగా నడవడం కంటే ఈ 8వ నెంబర్ ఆకారంలో నడవటం వల్ల కండరాలు అనేవి ఎక్కువగా పని చేస్తాయి. అటూ ఇటూ వంగుతూ నడవడం వల్ల పొట్ట దగ్గర కండరాలు, తొడ కండరాలు బలంగా మారుతాయి. ఎలాంటి దెబ్బ తగిలినా తట్టుకుంటాయి. ఫిట్‌నెస్ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది.

శరీరం బ్యాలెన్స్ పెరుగుతుంది:

ఎనిమిది నెంబర్ షేప్‌లో నడవటం వల్ల ఒక లాంటి హ్యాపీనెస్ పెరుగుతుంది. అంతే కాకుండా మలుపులు తిరిగేటప్పుడు శరీరం బ్యాలెన్స్‌గా లేకపోతే.. కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేయడం వల్ల శరీర సమన్వయం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..