Bread in Fridge: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెట్టి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది బ్రెడ్‌ని బ్రేక్ ఫాస్ట్‌గా, డిన్నర్‌గా తీసుకుంటున్నారు. బ్రెడ్‌లో చాలా రకాలు ఉన్నాయి. మీరు తీసుకునే బ్రెడ్‌ని బట్టి పోషకాలు అనేవి మీకు వస్తాయి. బ్రెడ్‌ని స్నాక్స్‌గా తీసుకుంటూ ఉంటారు. బ్రెడ్‌తో ఒక్కటేంటి చాలా రకాల వెరైటీ రెసిపీలే ఉన్నాయి. బ్రెడ్ తింటే సన్నగా అవుతారని చాలా మంది తమ డైట్‌లో యాడ్ చేసుకుంటున్నారు. అయితే బ్రెడ్‌ని తీసుకొచ్చి బయట పెడితే ఉండదు. రెండు రోజుల్లో పాడైపోతుంది. దీంతో ఎక్కడ స్టోర్ చేయాలో తెలీక..

Bread in Fridge: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెట్టి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Bread In Fridge
Follow us

|

Updated on: Jun 27, 2024 | 2:50 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది బ్రెడ్‌ని బ్రేక్ ఫాస్ట్‌గా, డిన్నర్‌గా తీసుకుంటున్నారు. బ్రెడ్‌లో చాలా రకాలు ఉన్నాయి. మీరు తీసుకునే బ్రెడ్‌ని బట్టి పోషకాలు అనేవి మీకు వస్తాయి. బ్రెడ్‌ని స్నాక్స్‌గా తీసుకుంటూ ఉంటారు. బ్రెడ్‌తో ఒక్కటేంటి చాలా రకాల వెరైటీ రెసిపీలే ఉన్నాయి. బ్రెడ్ తింటే సన్నగా అవుతారని చాలా మంది తమ డైట్‌లో యాడ్ చేసుకుంటున్నారు. అయితే బ్రెడ్‌ని తీసుకొచ్చి బయట పెడితే ఉండదు. రెండు రోజుల్లో పాడైపోతుంది. దీంతో ఎక్కడ స్టోర్ చేయాలో తెలీక.. ఫ్రిజ్‌లో పెడుతున్నారు. ఇలా ఫ్రిజ్‌లో బ్రెడ్ పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెడితే ఏం జరుగుతుంది:

మీకు బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెట్టే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. దీని వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. ఫ్రిజ్‌లో బ్రెడ్ పెట్టడం వల్ల మళ్లీ స్టార్చ్ కణాలు ఏర్పడతాయి. నీటిని బయటకు పంపి.. బ్రెడ్‌ని గట్టిగా మారుతుంది. దీంతో బ్రెడ్ త్వరగా రీక్రిస్టలైజ్ అవుతుంది.

రుచి తగ్గుతుంది:

బ్రెడ్ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల త్వరగా పాడవ్వడమే కాకుండా.. రుచి, ఆకృతి కూడా మొత్తం మారిపోతుంది. మృదుత్వాన్ని కోల్పోయి.. గట్టిగా మారుతుంది. బ్రెడ్ మీద ఉండే స్టార్చ్ గుణాల ఫ్రిజ్‌లోని ఇతర ఆహారాల రుచులను కూడా గ్రహించి టేస్టు లేకుండా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ కవర్ వాడవద్దు:

మీరు బ్రెడ్‌ని స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ ని అస్సలు ఉపయోగించవద్దు. దీని వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిస్తుంది. మీరు బ్రెడ్ స్టోర్ చేయాలంటే.. గాజు, స్టీల్ వస్తువులను ఉపయోగించండి.

బ్రెడ్ బూజు పట్టకుండా..

బ్రెడ్ త్వరగా బూజు పట్టి పాడైపోతుంది. దీనికి గాలి అనేది తగలకుండా చూసుకోవాలి. అందుకే చాలా మంది దీన్ని ఫ్రిజ్‌లో పెడతారు. కానీ దీని వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి గాలి చొరబడని గాజు లేదా స్టీవ్ కంటైనర్స్ ఉపయోగించండి. ఒకటే సారి ఎక్కువ మొత్తంలో తీసుకురాకుండా.. ఒక ప్యాకెట్ అలా తెచ్చుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..