AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!

చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అధిక నూనె, రసాయన షాంపూల వాడకం, ఒత్తిడి, చెడు జీవనశైలి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అంతేకాదు మనం తినే ఆహారాలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం కావచ్చు. అవును.. మనం ప్రతిరోజూ కొన్ని..

మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
Hair Fall
Srilakshmi C
|

Updated on: Dec 19, 2025 | 9:26 AM

Share

నేటికాలంలో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అధిక నూనె, రసాయన షాంపూల వాడకం, ఒత్తిడి, చెడు జీవనశైలి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అంతేకాదు మనం తినే ఆహారాలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం కావచ్చు. అవును.. మనం ప్రతిరోజూ కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. కాబట్టి ఆ ఆహారాలు ఏమిటో, దానిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు రాలడానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..

చక్కెర

చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజెన్ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ప్రభావితం చేస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది. జుట్టు పెరుగుదలను నెమ్మదిస్తుంది.

జంక్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

ప్రాసెస్ చేసిన ఆహారాలు

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలలో DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్ స్థాయిలను పెంచుతాయి. ఈ హార్మోన్ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది.

అధిక కెఫిన్ వినియోగం

కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. దీని వలన తల చర్మం పొడిబారుతుంది. ఇది జుట్టు పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఉప్పు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా, జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడానికి దారితీస్తుంది.

మద్యం

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో జింక్, ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడుతుంది. జింక్ లోపం వల్ల జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. జుట్టు రాలడం పెరుగుతుంది.

గమనిక: ఇందులో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వాటిని మేము నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.