AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోగాలను రూపుమాపే సహజ శక్తి.. చింత చిగురులో దాగిన ఔషధ రహస్యాలు తెలిస్తే..

చింత చిగురులో యాంటీ ఇన్ ఫ్లామెంటరీ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన వాపులు, నొప్పులు,తగ్గడమే కాకుండా పుండ్లు త్వరగా మానతాయి. చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే చిగురులోని ఫ్లేవ‌నాయిడ్స్‌, పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు.

రోగాలను రూపుమాపే సహజ శక్తి.. చింత చిగురులో దాగిన ఔషధ రహస్యాలు తెలిస్తే..
Chintha Chiguru
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2025 | 10:05 PM

Share

చింత చిగురులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ సులభమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాల్స్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చింత చిగురును నీటిలో ఉడికించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి. మసాలా ఆహారాల వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.

పిల్లలకు కడుపులో నులిపురుగుల సమస్య ఉంటే.. దీనితో చేసిన ఫుడ్ తినిపిస్తే ఫలితం ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్‌తో ఇబ్బంది పడేవారు చింత చిగురును ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. చింతచిగురు వాత వ్యాధులని, మూలరోగాన్ని, శరీరంలో ఏర్పడే గుల్మములను తగ్గిస్తుందని కూడా చెబుతున్నారు. పైత్యం, వికారం వంటివి కూడా తగ్గిస్తుందని అంటున్నారు. కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు.

ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు . ఒంగోలు ఏరియాలో దీనికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే కంటి సంబంధిత వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు. చింత చిగురులో యాంటీ ఇన్ ఫ్లామెంటరీ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన వాపులు, నొప్పులు,తగ్గడమే కాకుండా పుండ్లు త్వరగా మానతాయి. చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే చిగురులోని ఫ్లేవ‌నాయిడ్స్‌, పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..