AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల ఫుడ్స్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసా..?

పిల్లల ఆరోగ్యానికి మేలు చేయాలంటే.. వాళ్ళు తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. నేడు కనిపించే ఆకర్షణీయమైన ఫుడ్స్ అన్నీ మంచివే అనుకుంటే పొరపాటే. కొన్ని నార్మల్ ఆహారాలు కూడా పిల్లల రోగనిరోధక శక్తిని దెబ్బతీయగలవు. అలాంటి హానికరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల ఫుడ్స్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Kids Sugar Intake Tips
Prashanthi V
|

Updated on: Jul 18, 2025 | 10:04 PM

Share

పిల్లల ఆరోగ్యం బలంగా ఉండాలంటే చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పాలి. పోషకాలు లేని ఫుడ్ తినడం వల్ల గుండె సమస్యలు, షుగర్, అధిక బరువు లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు చిన్నారుల రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ప్రమాదం ఉంది. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫ్లేవర్డ్ యోగర్ట్

పెరుగు సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే. కానీ రుచి కోసం తయారు చేసే ఫ్లేవర్డ్ యోగర్ట్‌ లలో అధికంగా చక్కెర కలరింగ్ పదార్థాలు ఉంటాయి. పిల్లలు రోజుకు 25 గ్రాముల (దాదాపు 6 టీస్పూన్లు) కన్నా ఎక్కువ చక్కెర తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న పెరుగులో ఒక్క సర్వింగ్‌ లోనే 20 గ్రాముల చక్కెర ఉండటం వల్ల షుగర్ వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంది.

ప్రాసెస్ చేసిన మాంసాహారం

పిల్లల బ్రేక్‌ ఫాస్ట్ లేదా స్నాక్స్‌ లో సాసేజ్‌లు, బేకన్, హాట్‌ డాగ్‌ లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో అధిక సోడియం, నైట్రేట్‌ లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయకపోతే.. టీనేజ్‌ కు రాకముందే హై బీపీ, హై కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రావచ్చు.

హై ప్రాసెస్డ్ స్నాక్స్

ఇలాంటి తినుబండారాలను ఎక్కువగా ఉప్పు, కృత్రిమ రుచులు, అన్‌ హెల్తీ ఫ్యాట్స్‌ తో తయారు చేస్తారు. ఇవి తక్కువ వయసులోనే గుండె ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేయగలవు. పోషకాలు తక్కువగా ఉండటం వల్ల శరీరానికి సరైన శక్తి, రక్షణ అందవు.

అధిక చక్కెర కలిగిన డ్రింక్స్

సోడా, ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ లాంటి వాటిలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల తాగగానే బ్లడ్‌ షుగర్ పెరుగుతుంది. వీటిని ఎక్కువ కాలం తీసుకుంటే అధిక బరువు, షుగర్ లాంటి సమస్యలు పెరుగుతాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను ఇవ్వకపోగా.. శరీర శక్తిని తగ్గించవచ్చు.

ఫాస్ట్ ఫుడ్స్

ఈ రకమైన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్‌, అధిక కేలరీలు ఉంటాయి. పోషకాలు అస్సలు ఉండవు. ఎక్కువగా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్చుకోవడం చాలా ముఖ్యం.

పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వారికి సరైన పోషణ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన, చక్కెర రసాయనాలు కలిగిన ఆహారాలను తగ్గించడం ద్వారా.. వారికి బలమైన రోగనిరోధక వ్యవస్థను అందించవచ్చు.