AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రి పడుకునే ముందు చేసే ఈ 3 పనులు వెంటనే మానుకోండి.. లేదంటే సమస్యలకు షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే

మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో సరైన నిద్రకూడా అంతే అవసరం. కానీ ఇటీవల కాలంలో రాత్రి పూట మనం నిద్రపోకుండా మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే అలవాట్లు ఏమిటి, వాటిని వదులుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Health Tips: రాత్రి పడుకునే ముందు చేసే ఈ 3 పనులు వెంటనే మానుకోండి.. లేదంటే సమస్యలకు షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే
Sleep Deprivation Effects
Anand T
|

Updated on: Sep 30, 2025 | 4:00 PM

Share

ప్రస్తుత రోజుల్లో నిద్ర పోవడానికి చాలా మంది యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వారి జీవితంలోకి మొబైల్‌ అనేది వచ్చినప్పటి నుంచి జనాలు చాలా వరకు నిద్రకు దూరమైపోయారు. రాత్రి పడుకునే ముందూ ఫోన్‌ చేతిలో పట్టుకొని రీల్స్‌ స్ర్కోల్‌ చేయడం అలవాటు చేసుకున్నారు. దీని కారణంగా చాలా సేపు నిద్రపోకుండా ఉంటున్నారు. ఈ అలవాటే వ్యసనంగా మారి.. ఇప్పుడు త్వరగా నిద్రపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా రాత్రి పూట ఎక్కువ సమయం ఫోన్‌ చూడడం వల్ల వారు అనేక ఆరోగ్య సమస్యల బారీన పడుతున్నారు.

రాత్రి అతిగా మొబైల్‌ చూడడం

రాత్రి పూట మొబైల్ ఫోన్ నుంచి విడుదలయ్యే బ్లూలైట్‌ నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నిద్ర సమస్యలు వస్తాయి. అలాగే, రాత్రిపూట ఫోన్‌ను ఉపయోగించడం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి, పడుకునే 30 నిమిషాల ముందు ఫోన్‌ను ఉపయోగించడం మానుకోండి.

రాత్రి ఆహారంలో ఎక్కవ కారం తినడం

రాత్రి భోజనం సమయంలో మీరు ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే వెంటనే ఆపేయండి. రాత్రి ఆహారంలో కారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోండి. ఎందుకంటే రాత్రి ఎక్కువ కారం తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పికి కూడా దారి తీయవచ్చు. కారంగా ఉండే ఆహారం తినడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది.

రాత్రి ఆలస్యంగా తినడం

అలాగే రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఉంటే దాన్ని కూడా మార్చుకోండి. రాత్రి త్వరగా తినండి అలాగే తేలికపాటి ఆహారం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై రాత్రి మంచిగా నిద్రపడుతుంది.

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే అనర్థాలు

మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. మీరు నిద్రపోకపోతే, మీ మెదడు సామర్థ్యం తగ్గుతుంది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఒత్తిడి, చిరాకు, మరుసటి రోజు ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిద్రపోయే సమయాన్ని పాటించండి. మీరు ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. ఇలా కొన్ని రోజులు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..