AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 విషయాల్లో తొందరపడితే మీ జీవితమే ప్రమాదంలో పడుతుంది.. ఓపిక ఉంటేనే సక్సెస్‌

కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. అయితే చాలామంది ఓపిక లేకుండా, పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉందని..

ఈ 5 విషయాల్లో తొందరపడితే మీ జీవితమే ప్రమాదంలో పడుతుంది.. ఓపిక ఉంటేనే సక్సెస్‌
Making Decisions According To Chanakya Niti
Srilakshmi C
|

Updated on: Jun 03, 2026 | 9:04 PM

Share

జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. అయితే చాలామంది ఓపిక లేకుండా, పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో హెచ్చరించాడు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఎప్పుడూ ఆలోచించి, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.

జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం

ఉద్యోగం ఎంపిక, వృత్తి మార్పు, జీవిత భాగస్వామి ఎంపిక లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి కీలక నిర్ణయాలను ఎప్పుడూ తొందరపడి తీసుకోకూడదని చాణక్యుడు చెబుతాడు. పూర్తి సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పశ్చాత్తాపానికి కారణమవుతాయి. కాబట్టి ప్రతి అంశాన్ని విశ్లేషించి ముందుకు వెళ్లడం అవసరం.

సంబంధాల విషయంలో ఓపిక చాలా ముఖ్యం

స్నేహం చేయడం, ప్రేమ సంబంధం ప్రారంభించడం లేదా ఏదైనా సంబంధాన్ని ముగించడం వంటి విషయాల్లో భావోద్వేగాలకు లోనై వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దని చాణక్యుడు సూచించాడు. సంబంధాలు నమ్మకం, అవగాహన, ఓర్పుపై ఆధారపడి ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు మంచి బంధాలను కూడా దెబ్బతీయవచ్చు.

ఇవి కూడా చదవండి

డబ్బు విషయాల్లో తొందరపాటు నష్టాలకు దారి

పెట్టుబడులు పెట్టడం, భూములు కొనుగోలు చేయడం లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వంటి ఆర్థిక నిర్ణయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. సరైన పరిశీలన లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక నష్టాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని చాణక్యుడు హెచ్చరించాడు. అందుకే డబ్బు విషయాల్లో ఆలోచించి అడుగులు వేయాలని సూచించాడు.

కోపంలో తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరం

కోపం మనిషి ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది. కోపంలో మాట్లాడిన మాటలు, చేసిన పనులు జీవితాంతం బాధ కలిగించే పరిస్థితులను సృష్టించవచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు.

ఎవరినైనా వెంటనే నమ్మకండి

ప్రతి వ్యక్తి మన నమ్మకానికి అర్హుడు కాదని చాణక్యుడు పేర్కొన్నాడు. వ్యక్తుల ప్రవర్తన, ఉద్దేశాలు, విలువలను అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా నమ్మడం ప్రమాదకరమని హెచ్చరించాడు. తొందరపడి నమ్మకం ఉంచడం వల్ల మోసపోయే అవకాశాలు పెరుగుతాయి.

చాణక్యుడి సందేశం ఇదే..

జీవితంలో విజయాన్ని కోరుకునే వారు ఓపిక, వివేకం, పరిశీలన అనే మూడు గుణాలను అలవర్చుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం, భావోద్వేగాలకు లోనుకాకపోవడం, వ్యక్తులను మరియు పరిస్థితులను సరిగా అంచనా వేయడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. చాణక్య నీతి ప్రకారం తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే విజయానికి పునాది.

Follow Us