AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో జుట్టు రాలడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం.. వెంటనే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

వర్షాకాలంలో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు.. జుట్టు సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ సీజన్‌లో జుట్టు విరిగిపోవడం, చిట్లడం చాలా సాధారణం. అయితే మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే జుట్టు ఎక్కువగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో జుట్టు రాలడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం.. వెంటనే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
How To Stop Hair Fall In Rainy Season
Krishna S
|

Updated on: Jun 21, 2026 | 9:04 PM

Share

వేసవి వేడి నుంచి వర్షాకాలం మనకు ఉపశమనం కలిగించినప్పటికీ.. జుట్టుకు మాత్రం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. అవును.. వర్షాలు ప్రారంభం కాగానే చాలా మందిలో జుట్టు విపరీతంగా రాలడం, జుట్టు చిక్కుబడిపోవడం, తలలో దురద వంటి సమస్యలు మొదలవుతాయి. గాలిలో పెరిగే తేమ, వాతావరణంలోని దుమ్ము, ధూళి వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీనివల్ల కొద్దిగా దువ్వినా జుట్టు గుత్తులు గుత్తులుగా ఊడిపోతుంటుంది. అయితే వర్షాకాలంలో జుట్టు విరిగిపోవడాన్ని నివారించాలనుకుంటే.. మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లను మార్చుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు శుభ్రత ముఖ్యం.. కానీ ప్రతిరోజూ వద్దు..

వర్షాకాలంలో తలపై చెమట, దుమ్ము, జిడ్డు ఎక్కువగా పేరుకుపోతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చి కుదుళ్లు బలహీనపడతాయి. అయితే జుట్టును శుభ్రం చేయడానికి ప్రతిరోజూ షాంపూ చేయాల్సిన అవసరం లేదు. వారానికి రెండుసార్లు షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇది మీ స్కాల్ప్‌ను క్లీన్‌గా ఉంచడంతో పాటు జుట్టులోని సహజసిద్ధమైన తేమను కాపాడుతుంది. అలాగే తలస్నానం తర్వాత టవల్‌తో జుట్టును బలంగా రుద్దకుండా, మెల్లగా అద్ది ఆరబెట్టాలి.

తడి జుట్టును అస్సలు దువ్వకండి..

చాలా మందికి స్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వుకునే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు జుట్టుకు తీవ్ర నష్టం చేస్తుంది. సాధారణ సమయాల కంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ టైంలో దువ్వడం వల్ల జుట్టు త్వరగా తెగిపోతుంది. అంతేకాకుండా జుట్టు ఎక్కువసేపు తేమగా ఉండటం వల్ల తలపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి.

వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెననే వాడండి..

వర్షాకాలంలో జుట్టుకు చిక్కులు ఎక్కువగా పడుతుంటాయి. ఆ చిక్కులను వదిలించడానికి బలవంతంగా లాగడం వల్ల జుట్టు మధ్యలోకి విరిగిపోతుంది. అందుకే ఈ సీజన్‌లో ఎల్లప్పుడూ వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను ఉపయోగించడం మంచిది. ఇది జుట్టుపై ఒత్తిడిని తగ్గించి, ఊడిపోకుండా చూస్తుంది. అలాగే, ఇన్ఫెక్షన్లు, పేల సమస్యలు ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా ఉండాలంటే మీ దువ్వెనను ఇతరులతో పంచుకోకపోవడం ఉత్తమం.

వారానికి ఒకసారి హాట్ ఆయిల్ మసాజ్..

వర్షాకాలంలో జుట్టును బలంగా, దృఢంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా నూనె రాయడం చాలా అవసరం. వారానికి కనీసం ఒక్కసారైనా కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి తలకు మర్దనచేసుకోవాలి. ఇది జుట్టుకు మంచి పోషణను అందించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచి కుదుళ్లను స్ట్రాంగ్‌గా మారుస్తుంది. నూనె రాసిన కొన్ని గంటల తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కెమికల్స్ లేని మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

హీట్ స్టైలింగ్ టూల్స్‌కు దూరంగా ఉండండి..

గాలిలో తేమ వల్ల వర్షాకాలంలో జుట్టు సహజంగానే కాస్త నిర్జీవంగా కనిపిస్తుంది. దీనికోసం హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్ ఐరన్‌లు లేదా బ్లో డ్రైయర్‌లను అతిగా వాడటం వల్ల జుట్టు మరింత పొడిబారి, బలహీనపడిపోతుంది. ఫలితంగా జుట్టు చిట్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీ జుట్టును సహజ గాలికి ఆరనివ్వడం, హీట్ స్టైలింగ్‌ను పూర్తిగా తగ్గించడం ఎంతో మంచిది.

Follow Us
వర్షాకాలంలో జుట్టు రాలడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం..
వర్షాకాలంలో జుట్టు రాలడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం..
పూజ గదిలో గణేశుడిని ఇలా ఉంచితే ఆటంకాలు తొలగి ఐశ్వర్యం వస్తుందట!
పూజ గదిలో గణేశుడిని ఇలా ఉంచితే ఆటంకాలు తొలగి ఐశ్వర్యం వస్తుందట!
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?