AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు.. ఇలా చేస్తే మెరిసిపోతాయ్..

ఫేవరెట్ డ్రెస్‌పై చిన్న మరక పడినా ఆ బాధ వర్ణనాతీతం. చాలా సార్లు మొండి మరకల వల్ల మనకు ఎంతో ఇష్టమైన దుస్తులను పక్కన పడేస్తుంటాం. అయితే బట్టల క్వాలిటీ దెబ్బతినకుండా, రంగు వెలిసిపోకుండా మొండి మరకలను క్లీన్ చేయడానికి కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు.. ఇలా చేస్తే మెరిసిపోతాయ్..
How To Remove Stubborn Stains From Clothes
Krishna S
|

Updated on: Jun 21, 2026 | 8:48 PM

Share

బట్టలపై పడిన మరకలను క్లీన్ చేయడం మహిళలకు పెద్ద టాస్క్. టీ, నూనె మరకలు తొలగించడం పెద్ద చికాకు తెప్పిస్తాయి. ఎంత రుద్దిన మరకలు అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు డిటర్జెంట్లతో ఉతికినా ఆ మొండి మరకలు పూర్తిగా వదలవు సరే కదా.. బట్టల మెరుపు కూడా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఖరీదైన కెమికల్స్, వాషింగ్ పౌడర్ల కంటే వంటింట్లో దొరికే కొన్ని సులభమైన హోమ్ రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. ఏ బట్టలపై పడిన మరకలనైనా సులభంగా వదిలించే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బేకింగ్ సోడా – నిమ్మరసం కాంబినేషన్

బట్టలపై పడిన తేలికపాటి లేదా మామూలు మరకలను, జిడ్డును తొలగించడానికి బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మరక ఉన్న భాగంలో అప్లై చేసి, 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్ది, ఎప్పటిలాగే డిటర్జెంట్‌తో ఉతికేస్తే మరకలు మాయమవుతాయి.

తెల్ల వెనిగర్ మ్యాజిక్

ఒకవేళ బట్టలపై మరకలు బాగా పాతబడిపోయి, మొండిగా మారితే తెల్ల వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. ఇది బట్టల రంగును పాడు చేయకుండా మరకలను లూజ్ చేస్తుంది. ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో అర కప్పు తెల్ల వెనిగర్ కలపండి. ఈ నీటిలో మరకలు ఉన్న బట్టలను 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత నార్మల్ డిటర్జెంట్‌తో ఉతికేయండి. వెనిగర్ కేవలం మొండి మరకలనే కాకుండా బట్టల నుండి వచ్చే చెమట దుర్వాసనను, బ్యాక్టీరియాను కూడా పూర్తిగా దూరం చేస్తుంది.

మరకలు పడిన వెంటనే చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని

ఏదైనా బట్టపై మరక పడినప్పుడు అది వదిలిపోవడానికి ఉన్న ఏకైక సులభమైన మార్గం.. ఆ మరక ఆరిపోకుండా చూసుకోవడమే. బట్టలపై టీ, కాఫీ లేదా కూరగాయల నూనె పడిన వెంటనే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ భాగాన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మరక అనేది బట్ట నూలు పోగుల్లోకి లోతుగా ఇంకకుండా ఉంటుంది. ఫలితంగా తర్వాత ఉతికేటప్పుడు చాలా సులభంగా వదిలిపోతుంది.

ప్రయోగాలు చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కేర్ లేబుల్ చదవండి: బట్టలపై మరకలు వదిలించడానికి బ్లీచ్ లేదా మరేదైనా కెమికల్ ఉపయోగించే ముందు ఆ దుస్తులకు ఉన్న కేర్ లేబుల్‌ను తప్పకుండా చదవండి. కొన్ని బట్టలకు కేవలం డ్రై క్లీనింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది.

సున్నితమైన వస్త్రాలు: నిమ్మకాయ, వెనిగర్ లేదా కెమికల్ బ్లీచ్ వాడటం వల్ల కొన్ని రకాల సిల్క్ లేదా ఊలు వస్త్రాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్యాచ్ టెస్ట్: ఏదైనా ఇంటి చిట్కాను నేరుగా బట్టపై అప్లై చేసే ముందు.. దుస్తుల లోపలి వైపు వెనుక భాగంలో లేదా అంతగా కనిపించని చిన్న ప్రదేశంలో పరీక్షించి, బట్ట రంగు మారడం లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాడటం ఉత్తమం.

మొండి మరకలు పడ్డాయని మీకు నచ్చిన దుస్తులను పక్కన పడేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, నిమ్మకాయ, వెనిగర్ వంటి సింపుల్ వంటింటి చిట్కాలతో పాటు సకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. మీ బట్టలు చాలా కాలం పాటు పాడవకుండా, కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి

Follow Us
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు