Rajinikanth: 75 ఏళ్ల వయసులో రజినీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. విదేశాలకు వెళ్లినా మారని డైట్..
సూపర్ స్టార్ రజినీకాంత్.. యావత్ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. సాదారణ కండక్టర్.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన స్టైల్, మేనరిజం, యాక్టింగ్ అంటే అడియన్స్ కు ఎంత ఇష్టమనేది చెప్పక్కర్లేదు. 75 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే అప్పుడు. ఇప్పుడు ఒకే ఎనర్జీతో కనిపిస్తున్నారు. తాజాగా ఆయన డైట్ సీక్రెట్ ఏంటీ అనేది రివీల్ అయ్యింది.

Rajinikanth
- సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు అనే సంగతి తెలిసిందే. కోట్లు సంపాదించినా.. స్టార్ డమ్ సొంతం చేసుకున్నప్పటికీ ఒక సామాన్య వ్యక్తిలా జీవిస్తుంటారు. అయితే రజినీకాంత్ జీవితం.. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పక్కర్లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన దినచర్య గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్టార్స్ ఇంత సాధారణంగా జీవిస్తారా అని షాకవుతారు. 75 ఏళ్ల వయసులో రజినీ ఇంత యాక్టివ్ గా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసుకుందామా.
- రజినీ ఉదయం నిద్ర లేవగానే రాగి చెంబులోని నీరు తాగుతారట. అలాగే కాసేపు వాకింగ్ చేసిన తర్వాత యోగా, మెడిటేషన్ చేస్తారట. ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా ఫ్రూట్స్ తీసుకుంటారు. షూటింగ్ కు వెళ్లేముందు ఓట్స్ టిపిన్ చేసి.. మధ్యాహ్నం భోజనంలోకి పుల్కాలు, కాస్త రైస్ మాత్రమే తీసుకుంటారు. ఇక రజినీ రోజులో ఎప్పుడూ స్నాక్స్ తీసుకోరు. రాత్రి భోజనంలో ఫ్రూట్స్, లేదా మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటారు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినా ఆయన డైట్ అస్సలు మారదని సన్నిహితులు చెబుతుంటారు.
- తన గది మాత్రం పూర్తిగా దేవుడి ఫోటోలతో.. ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఆయన పడుకోవడానికి నేలపై మాములు పరుపు, నూలు తాళ్లతో అల్లిన మంచం ఉంటుంది. నిద్రపోయేందుకు వాటినే ఉపయోగిస్తారు. రజినీకి ఆద్యాత్మికత.. భక్తి అంటే ఎంతో గౌరవం. తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదోక దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు. ఎన్నోసార్లు హిమాలయాకు, తిరుమలకు వెళ్లి వచ్చారు.
- సంవత్సరంలో ఒకసారి తన స్నేహితులతో కలిసి కచ్చితంగా వెకేషన్ కు వెళ్తారు. ఆ సమయంలో సాధారణమైన దుస్తులు ధరిస్తారు. సింపుల్ గా కనిపిస్తారు. ప్రయాణం మధ్యలో ఆకలి వేస్తే స్నేహితులతో కలిసి రోడ్డు పక్కనే భోజనం చేస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాఘవేంద్రస్వామి, మహావతార్ బాబాజీ, రమణ మహర్షిలను తన గురువులుగా భావిస్తారు. హిమాలయాలకు వెళ్లి అక్కడి సాధువులను, స్వాములను కలుసుకుంటూ ఉంటారు. వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు.
- ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇటీవలే జైలర్, కూలీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. 2023లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో రజనీకాంత్ వన్-మ్యాన్ షో, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఏ రేంజ్ పూనకాలు తెప్పించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Follow Us





