పీరియడ్స్ సమస్యలా.. రోజూ ఉదయాన్నే ఈ నీరు తాగితే చాలు..
Krishna
21 June 2026
PCOD సమస్యకు ప్రధాన కారణం శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు. మహిళలు క్రమం తప్పకుండా లవంగాల నీటిని తాగడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది. ఇది అంతర్గత ఆరోగ్య వ్యవస్థను రీబూట్ చేయడానికి సహాయపడుతుంది.
హార్మోన్ల సమతుల్యత
PCOD ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పడమే కాకుండా బరువు తగ్గడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.
ఇన్సులిన్ నిరోధకత
లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. తద్వారా అండాశయాలకు ఎటువంటి ఆక్సిడేటివ్ ఒత్తిడి కలగకుండా రక్షణ కల్పించి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అండాశయం
PCOD బాధితుల్లో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. లవంగాల నీటిని నిరంతరం డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఋతుచక్రం సక్రమంగా మారి, పీరియడ్స్ టైమ్‌కి వచ్చేలా సహాయపడుతుంది.
రెగ్యులర్ పీరియడ్స్
PCOD సమస్య ఉన్న మహిళల్లో సాధారణం కంటే చాలా వేగంగా బరువు పెరుగుతారు. మెటబాలిజం నెమ్మదించడమే దీనికి కారణం. లవంగాల నీరు శరీరంలో కొవ్వును కరిగించడంలో, బరువు నియంత్రణలో పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.
బరువు తగ్గడం
PCOD ఉన్న మహిళల్లో ముఖం, గడ్డం భాగాలపై మొటిమలు విపరీతంగా వస్తుంటాయి. లవంగాల నీటిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి, మొటిమల సమస్యను లోపలి నుంచే తగ్గిస్తాయి.
మొటిమలకు చెక్
PCOD బాధితుల్లో జీర్ణ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. రోజూ ఉదయాన్నే లవంగాల నీరు తాగడం వల్ల లాలాజలం, జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది.
జీర్ణక్రియ
అజీర్తి కారణంగా వచ్చే గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలకు లవంగాల నీరు ఒక సహజసిద్ధమైన హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. కడుపులో మంటను తగ్గించి రిలాక్సేషన్ ఇస్తుంది.