AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్ తిన్న వెంటనే వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఆస్పత్రికెళ్లడం ఖాయం..

చికెన్, మటన్ తినడం ఎంత రుచిగా ఉంటుందో.. వాటిని తిన్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే ఇబ్బందిగా మారుతుంది. నాన్ వెజ్ తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి నాన్‌వెజ్ తిన్న వెంటనే అస్సలు ముట్టుకోకూడని, మన ఇంట్లోనే ఉండే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

చికెన్, మటన్ తిన్న వెంటనే వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఆస్పత్రికెళ్లడం ఖాయం..
What To Avoid After Eating Non VegImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: Jun 21, 2026 | 9:37 PM

Share

సండే వచ్చిందంటే ప్రతి నాన్ వెజ్ వంటలు ఘుమఘుమలాడతాయి. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొంతమంది అయితే రెండు రోజులకు ఒకసారి ముక్క లేకపోతే అస్సలు ఉండలేరు. నాన్‌వెజ్ వంటకాల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మాంసాహారం తినేటప్పుడు ఎంత శ్రద్ధ చూపిస్తామో.. తిన్న తర్వాత కూడా కొన్ని విషయాల్లో అంతే జాగ్రత్తగా ఉండాలి. చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల తీవ్రమైన అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. మరి నాన్‌వెజ్ తిన్న వెంటనే అస్సలు ముట్టుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

చల్లటి నీరు – ఐస్ క్రీమ్

భారీగా నాన్‌వెజ్ భోజనం చేసిన వెంటనే చాలా మంది చల్లటి ఫ్రిజ్ నీళ్లు తాగడం లేదా ఐస్ క్రీమ్ తినడం చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. మాంసాహారంలోని కొవ్వులు కరగడానికి శరీరం లోపల వేడి అవసరం. తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ తాత్కాలికంగా మందగిస్తుంది. దీనివల్ల కొవ్వులు గడ్డకట్టి అజీర్ణం సమస్య మొదలవుతుంది.

పాలు – పాల ఉత్పత్తులు

చేపలు, చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే పాలు, మజ్జిగ, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మాంసంలోని ప్రోటీన్లను జీర్ణం చేసే ప్రక్రియ.. పాలను జీర్ణం చేసే ప్రక్రియతో భిన్నంగా ఉంటుంది. ఈ రెండూ ఒకేసారి కడుపులోకి వెళ్తే తీవ్రమైన గ్యాస్, కడుపు నొప్పి లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

సిట్రస్ పండ్లు

నాన్‌వెజ్ తిన్న వెంటనే నిమ్మకాయలు, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లను తినడం మంచిది కాదు. ఈ పండ్లు చాలా వేగంగా జీర్ణమవుతాయి.. కానీ మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ టైమింగ్స్ మిస్ అవ్వడం వల్ల కడుపులో యాసిడ్లు పెరిగి గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

టీ – కాఫీ

భారీ భోజనం తర్వాత ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. కానీ మాంసాహార వంటకాలు తిన్న వెంటనే వీటికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలలో ఉండే టానిన్ అనే పదార్థాలు.. మనం తిన్న మాంసం లేదా సీఫుడ్ నుండి శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవు.

స్వీట్లు – డెజర్ట్స్

భోజనం తర్వాత స్వీట్ తినడం ముచ్చటే అయినా.. నాన్‌వెజ్ తిన్న వెంటనే డెజర్ట్స్ జోలికి వెళ్లొద్దు. మాంసంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు జీర్ణం కావడానికి ఇప్పటికే మీ జీర్ణవ్యవస్థ చాలా కష్టపడుతుంటుంది. దీనిపై మళ్లీ చక్కెరతో కూడిన స్వీట్లు వేస్తే జీర్ణక్రియ మరింత మందగించి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ పీక్స్‌కు చేరుకుంటాయి.

హెవీ కార్బోహైడ్రేట్ ఆహారాలు

బంగాళాదుంపలు లేదా స్టార్చ్ ఎక్కువగా ఉండే ఇతర పిండి పదార్థాల కూరలను, కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారంతో కలిపి భారీ పరిమాణంలో తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ జీర్ణం కావడానికి విపరీతమైన సమయం పడుతుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత శరీరం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయి విపరీతమైన నీరసం, బద్ధకం, కడుపు నొప్పికి దారితీస్తుంది.

గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇది వైద్యుల లేదా ఆరోగ్య నిపుణుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆహార మార్పులు చేసే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us