Monsoon Skin Care: మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఇలా కాఫీ స్క్రబ్ ట్రై చేయండి!

ఈ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఇతర చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. చర్మ సమస్యలను నయం చేసేందుకు కాఫీతో స్క్రబ్‌ తయారు చేసి వాడొచ్చు. కాఫీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కాఫీని ఉపయోగించడం వల్ల చర్మం మెరిసిపోతుంది. కాఫీతో తయారు చేసే స్క్రబ్‌లను వారానికి రెండు మూడు సార్లు ఉపయోగిస్తే, వర్షాకాలంలో మీకు చర్మ సమస్యలు దరిచేరవు.

Monsoon Skin Care: మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఇలా కాఫీ స్క్రబ్ ట్రై చేయండి!
Best Scrub For Monsoon
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 3:21 PM

వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు సర్వసాధారణం. ఈ సీజన్‌లో సాధారణంగానే చర్మం జిడ్డుగా మారుతుంది. దీని వల్ల మొటిమల సమస్య కూడా పెరుగుతుంది. ఈ సీజన్‌లో నిర్జీవమైన చర్మానికి జీవం పోయడానికి స్క్రబ్ ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలంలో ఆయిల్ స్కిన్, డెడ్ స్కిన్‌ వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా..? అయితే, మీకు అవసరమైన ఒక బెస్ట్‌ స్క్రబ్‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. అది కాఫీ పొడితో తయారు చేసే ఈ ఫేస్‌ స్క్రబ్‌ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఇతర చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. చర్మ సమస్యలను నయం చేసేందుకు కాఫీతో స్క్రబ్‌ తయారు చేసి వాడొచ్చు. కాఫీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కాఫీని ఉపయోగించడం వల్ల చర్మం మెరిసిపోతుంది. కాఫీతో తయారు చేసే స్క్రబ్‌లను వారానికి రెండు మూడు సార్లు ఉపయోగిస్తే, వర్షాకాలంలో మీకు చర్మ సమస్యలు దరిచేరవు.

కొబ్బరినూనె, కాఫీ పొడి:

ఒక గిన్నెలో అర చెంచా కొబ్బరి నూనె తీసుకుని అందులో అర చెంచా కాఫీపొడి వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది. మీ చర్మం జిడ్డుగా ఉంటే కొబ్బరి నూనెను నివారించండి.

ఇవి కూడా చదవండి

తేనె, కాఫీ పొడి:

ఒక గిన్నెలో మూడు చెంచాల తేనె తీసుకుని అందులో అర చెంచా కాఫీ పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య ఉండదు.

పెరుగు, కాఫీ పొడి :

ఒక గిన్నెలో ఒక చెంచా పెరుగు తీసుకుని అందులో అర చెంచా కాఫీ పొడి వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయండి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేయొద్దు. 15 నిమిషాల తర్వాత మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీంతో చర్మం మెరిసిపోతుంది.

కాఫీ, ఆలివ్ ఆయిల్ :

ఒక గిన్నెలో అర టీస్పూన్ పంచదార, అర టీస్పూన్ కాఫీ పౌడర్, రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 5 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తరువాత మరో ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

నిమ్మరసం, కాఫీ పొడి :

ముఖంపై నల్ల మచ్చలు పెరిగితే, ఒక చెంచా నిమ్మరసం, అర చెంచా కాఫీ పొడిని ఒక గిన్నెలో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తరువాత, చేతులతో తేలికపాటి మసాజ్ చేయండి. ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసి చల్లటి నీటితో కడగాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్