AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ విద్యార్థి బ్రెయిన్‌ డెడ్.. ఆమె కుటుంబం చేసిన అపూర్వ త్యాగంతో 10 మందికి కొత్త జీవితం

మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో ఉన్నట్టుండి వాంతులు చేసుకుంది.. అంతలోనే ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు.

ఇంటర్‌ విద్యార్థి బ్రెయిన్‌ డెడ్.. ఆమె కుటుంబం చేసిన అపూర్వ త్యాగంతో 10 మందికి కొత్త జీవితం
Brain Dead
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2024 | 10:12 PM

Share

ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 200 అవయవాలను దానం చేసి పది మంది ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న తమ కూతురు బ్రెయిన్ డెడ్‌తో హఠాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది. మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో ఉన్నట్టుండి వాంతులు చేసుకుంది.. అంతలోనే ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు.

బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు. చివరకు దీపిక బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ఆ తల్లి దండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయవాలు దానం చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఆ బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు. దీపిక త‌ల్లిదండ్రులు చేసిన ఈ గొప్ప పనిని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వారి ఔదార్యానికి వైద్యులు సైతం అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి