TGSRTC Free Bus for Women: ఓర్నాయనో.. ఫ్రీ బస్సును ఇలా కూడా వాడుతున్నారా? పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ.. వీడియో

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. రేవంత్‌ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం ఏదో ఒక లొల్లితో వార్తల్లో నిలుస్తూనే ఉంది...

TGSRTC Free Bus for Women: ఓర్నాయనో.. ఫ్రీ బస్సును ఇలా కూడా వాడుతున్నారా? పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ.. వీడియో
Woman Brushing Teeth In Running RTC Bus
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 29, 2024 | 5:41 PM

హైదరాబాద్‌, జులై 29: తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. రేవంత్‌ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం ఏదో ఒక లొల్లితో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగలు, పబ్బాల సమయంలో సరేసరి. బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి.

అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. కొద్దిపాటి దూరానికి కూడా బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో అయితే విద్యార్ధులు, ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణం చేయలేక నానాకష్టాలు పడుతున్నారు. ఎట్లాగూ టికెట్‌ లేకుండా పోవచ్చని కొందరు మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు ఎక్కేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోలో ఓ మహిళ టీజీఎస్‌ ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చుని ఉండటం చూడొచ్చు. అయితే సదరు మహిళ.. తాపీగా కిటికీ పక్కన సీట్లో కూర్చుని, బయటి వ్యూ చూస్తూ బ్రష్‌ చేస్తూ ఉండటం వీడియోలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇంటి వద్ద బ్రష్‌ చేసేందుకు టైం ఎందుకు వేస్ట్‌ చేసుకోవాలని అనుకుందో ఏమో.. మరి! ఇలా ఏకంగా ఆర్టీసీ బస్సులో బ్రష్‌ చూస్తూ ప్రయాణించింది. ఈ వీడియోను అదే బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫ్రీ బస్ పథకం దుర్వినియోగం అవుతుందంటూ మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మహిళలు కండక్టర్లపై దాడి చేయడం, సీట్ల కోసం జుట్లుపట్టి కొట్టుకోవడం వంటి సీన్‌లు చూశాం. ఇప్పుడేమో ఎంచక్కా బ్రష్ చేస్తూ ప్రయాణిస్తున్నారు. ఇక మునుముందు బస్సును ఏయే పనులకు వినియోగిస్తారో అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే
బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా.. బాబోయ్
బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా.. బాబోయ్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!