Sircilla Police: అందులో రాష్ట్రంలో నెం.1 స్థానం.. సిరిసిల్ల జిల్లా పోలీసుల ఘనత
సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లను సబంధిత బాధితులకు అందించారు. 84శాతం రికవరీ ఫోన్లతో రాష్టంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచించింది. రికవరీ చేసిన సొత్తు విలువ సుమారుగా కోటి రూపాయలు. రాష్ట్రంలో కమిషనరేట్స్ కాకుండా మిగితా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే సిరిసిల్ల జిల్లాలో 1000 పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం విశేషం.
గత కొన్ని రోజుల నుండి పోగొట్టుకున్న, దొంగలించబడిన ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు సిరిసిల్ల పోలీసులు.. గత ఏడాది ఏప్రిల్ 20 నుండి జులై 28వ తేదీ వరకు జిల్లాలో 1,200 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించారు. సెల్ఫోన్ పోయిందంటే టెన్షన్ పడవద్దని.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని పోలీసులు నిరూపిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లను సబంధిత బాధితులకు అందించారు. 84శాతం రికవరీ ఫోన్లతో రాష్టంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచించింది. రికవరీ చేసిన సొత్తు విలువ సుమారుగా కోటి రూపాయలు. రాష్ట్రంలో కమిషనరేట్స్ కాకుండా మిగితా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 1000 పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం విశేషం. మీ బంధువులు, స్నేహితుల్లో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా.. ఎక్కడైనా పోగొట్టుకున్నా.. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని బాధితులకు జిల్లా ఎస్పీ సూచించారు.
సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి..
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏ రోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు.
సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84% రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన ఐటీ కోర్ జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. పోయిన ఫోను ఇక దొరకదు అనుకున్నామని.. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి తమ ఫోన్ రికవరీ చేసి అందించినందుకు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.