Andhra Pradesh: కోనసీమలో కూలీల కొరత.. వరినాట్లకు కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు

అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు కూలీల కొరత ఏర్పడటంతో కలకత్తా, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి రైతులు కూలీలను దిగుమతి చేసుకుంటున్నరు. పి.గన్నవరం మండలం ముంగండలో వరి ఉడ్పులు ఊడ్చేదుకు వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో రైతులు ఒక ఏజెంట్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. అయితే కలకత్తా నుండి వచ్చిన..

Andhra Pradesh: కోనసీమలో కూలీల కొరత.. వరినాట్లకు కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
kolkata Labor
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Jul 27, 2024 | 8:07 PM

కోనసీమ, జులై 27: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు కూలీల కొరత ఏర్పడటంతో కలకత్తా, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి రైతులు కూలీలను దిగుమతి చేసుకుంటున్నరు. పి.గన్నవరం మండలం ముంగండలో వరి ఉడ్పులు ఊడ్చేదుకు వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో రైతులు ఒక ఏజెంట్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. అయితే కలకత్తా నుండి వచ్చిన కూలీలు ఒకే కలర్ డ్రెస్ ధరించి జై శ్రీరామ్ అంటూ రాముడు పాటలు పాడుతూ వరి పొలంలో పనులు చేస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు. కూలీల యూనిఫామ్, అలాగే శ్రీరాముడి పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఒకప్పుడు కోనసీమలో వరి పొలంలో పనులు చేసే కూలీలు జనపథం పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా పనులు చేసేవారు. అయితే ఇప్పుడు కూలీలు ఎవరూ వరి పొలాల్లో పనులకు రాకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. దీనితో రైతులకు కూలీల కొరత ఏర్పడింది. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. రైతులకు కూలీల కొరత రాకుండా ఉండాలంటే ఉపాధి కూలీలను రైతులకు అనుసంధానం చేయాలని రైతులు అంటున్నారు. లెకపోతే ఇదే పరిస్థితి కొనసాగితే కోనసీమలో వరి రైతులు పూర్తిగా వ్యవసాయం వదిలేసే పరిస్థితులు వస్తాయని కోనసీమ రైతులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం వదిలేస్తామని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వరి పంట వేసే సమయం కాబట్టి రైతులకు పెట్టుబడి పెట్టేందుకు వేల రూపాయలు ఖర్చులు అవుతాయని, కానీ మూడు నెలల క్రితం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని, వెంటనే ధాన్యం బకాయిలు చెల్లించాలని కోనసీమ రైతులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.