AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ooragaya Pickle: హోటల్ భోజనంలో ఊరగాయ వడ్డించలేదని కోర్టుకెక్కిన ఘనుడు.. రూ.35 వేలు జరిమానా!

రెస్టారెంట్‌ భోజనంలో పచ్చడి వడ్డించలేదని ఓ వ్యక్తి కోర్టులో ఏకంగా రెండేళ్లు పోరాడగా.. దీనిపై తాజాగా తీర్పు వెలువడింది. అన్నంలో ఊరగాయ పచ్చడి వడ్డించకపోవడం సేవల్లో లోపంగా భావించిన కోర్టు ఏకంగా రూ.35,025 జరిమానా విధించింది. ఈ మొత్తం డబ్బు 45 రోజుల్లోగా చెల్లించాలని, అలా చెల్లించకలేకపోతే నెలకు 9 శాతం వడ్డీతో పాటు పెనాల్టీ మొత్తం చెల్లించాలని కోర్టు సదరు రెస్టారెంట్‌ను ఆదేశించింది...

Ooragaya Pickle: హోటల్ భోజనంలో ఊరగాయ వడ్డించలేదని కోర్టుకెక్కిన ఘనుడు.. రూ.35 వేలు జరిమానా!
Consumer Court Fines Restaurant
Srilakshmi C
|

Updated on: Jul 26, 2024 | 6:33 PM

Share

చెన్నై, జులై 26: రెస్టారెంట్‌ భోజనంలో పచ్చడి వడ్డించలేదని ఓ వ్యక్తి కోర్టులో ఏకంగా రెండేళ్లు పోరాడగా.. దీనిపై తాజాగా తీర్పు వెలువడింది. అన్నంలో ఊరగాయ పచ్చడి వడ్డించకపోవడం సేవల్లో లోపంగా భావించిన కోర్టు ఏకంగా రూ.35,025 జరిమానా విధించింది. ఈ మొత్తం డబ్బు 45 రోజుల్లోగా చెల్లించాలని, అలా చెల్లించకలేకపోతే నెలకు 9 శాతం వడ్డీతో పాటు పెనాల్టీ మొత్తం చెల్లించాలని కోర్టు సదరు రెస్టారెంట్‌ను ఆదేశించింది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడు రాష్ట్రం విల్లుపురం బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాలమురుగన్ అనే రెస్టారెంట్‌ మేనేజర్ భోజనం పార్శిల్‌లో 11 వస్తువులను ఇస్తామని బోర్డు పెట్టుకున్నాడు. 2022లో వలుతారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరోగ్యసామి అనే వ్యక్తి విల్లుపురం కొత్త బస్టాండ్ సమీపంలోని సదరు రెస్టారెంట్‌లో రూ.2 వేలకు 25 మందికి బోజనం పార్శిల్‌లను కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి భోజనం ధరపై ఆరా తీయగా.. అన్నం, సాంబారు, కరివేపాకు, రసం, మజ్జిగ, దంపులు, ఊరగాయ పచ్చడి, అరటి ఆకులు, పచ్చిమిర్చి కలిపి మొత్తం 11 ఐటెమ్స్‌ ఇస్తామని, భోజనం ఖరీదు రూ.80 అని రెస్టారెంట్ యాజమాని తెలిపాడు. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ నుంచి భోజనం పార్శిల్‌లను కొనుగోలు చేసి తీసుకెళ్లాడు.

అయితే భోజనం చేస్తుండగా.. పార్శిల్‌లో ఊరగాయ కనిపించలేదు. 11 రకాల ఆహారపదార్థాలు ఉన్నాయని చెప్పిన పార్శిల్ భోజనంలో పచ్చళ్లు లేకపోవడంతో నిరాశ చెందిన ఆరోగ్యస్వామి సంబంధిత హోటల్ యాజమాన్యాన్ని ఈ విషయమై ప్రశ్నించాడు. అయితే హోటల్ యాజమాన్యం అతడికి సమాధానం చెప్పకపోగా.. దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆరోగ్యస్వామి.. కంజ్యూమర్‌ కోర్టులో కేసు వేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. భోజనంలో ఊరగాయ పచ్చడి అందించకపోవడం వల్ల పిటిషనర్‌కు మానసిక క్షోభ కలిగించిందని పేర్కొంటూ సంబంధిత రెస్టారెంట్‌కు జరిమానాగా రూ.35,000, పచ్చడికి రూ. 25 చెల్లించాలని రెస్టారెంట్ యాజమన్యాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.