AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది.. ప్రేమకథేంటో తెలుసా..? కారణం ఇదేనట..!

శతాబ్దాలుగా ప్రజలను తనవైపు ఆకర్షిస్తూ.. దట్టమైన అడవుల మధ్య భారతదేశం మధ్యలో ఒక నది ప్రవహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ పీఠభూమి నుండి ఉద్భవించిన ఈ నది శతాబ్దాలుగా నాగరికతలను పోషించింది మరియు లెక్కలేనన్ని ఇతిహాసాలకు కూడా జన్మనిచ్చింది. భారతదేశంలో వ్యతిరేక దిశలో ప్రవహించే ఏకైక నది ఇదే. ప్రేమ, ద్రోహం, ఒంటరితనం వంటి అనేక కథలు ఈ నదితో ముడిపడి ఉంది. ఉన్నాయి. భారతదేశంలో రివర్స్ దిశలో ప్రవహించే ఏకైక నది నర్మదా నది గురించి తెలుసుకుందాం.

వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది.. ప్రేమకథేంటో తెలుసా..? కారణం ఇదేనట..!
West Flowing Rivers Of Indi
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2024 | 10:13 PM

Share

గంగా-యమునా లాగా, నర్మదా నది కూడా లక్షలాది మంది ప్రజల భక్తి విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. నర్మదా నదిలో స్నానాలు, ధ్యానం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఈ నర్మదా నదికి ఉన్న విశిష్టత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అన్ని నదులు పడమర నుండి తూర్పు వైపుకు ప్రవహిస్తుంటాయి. చివరకు బంగాళాఖాతంలో కాలుస్తాయి. అలా కాకుండా తూర్పు నుంచి పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది నర్మదా నది..! అవును, భారతదేశంలోని అన్ని చిన్న, పెద్ద నదులలో, నర్మదా మాత్రమే వ్యతిరేక దిశలో ప్రవహించే నది. దీనిని ‘ఆకాశ కుమార్తె’ అని కూడా అంటారు. ఇదొక్కటే కాదు, నర్మదా ప్రయాణం వెనుక ప్రేమ, ద్రోహం, ఒంటరితనం, కన్యగానే మిగిలిపోయిన వనిత నర్మదా వంటి అనేక కథలు కూడా ఈ నదితో ముడిపడి ఉన్నాయి.. అసలు నర్మద ఎందుకు కన్యగా ఉండిపోయింది. వ్యతిరేక దిశలో ప్రవహించడానికి శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసుకుందాం.

– నర్మద ఎందుకు పెళ్లి చేసుకోలేదు..?

పురాణాల ప్రకారం.. నర్మదానది ఒక అందమైన యువరాజుగా పేరుగాంచిన సోనభద్రను ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ సోనభద్ర.. నర్మద స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడట. దీంతో కోపోద్రిక్తురాలైన నర్మద వెనక్కు మళ్లిందట. తన ప్రేమను చంపేసుకుని జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది.. ఇక అప్పటి నుండి వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ కన్యగానే ఉండిపోయిందని చెబుతారు. ఇందుకు నిదర్శనం అన్నట్టుగా ఓ ప్రదేశంలో సోనభద్ర నది నుంచి విడిపోతున్నట్లు నర్మద ప్రవాహం కనిపిస్తుంది. నేటికీ వ్యతిరేక దిశలో ప్రవహించటానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

– శాస్త్రీయ కారణం ఏమిటి..?

శాస్త్రవేత్తల ప్రకారం, భౌగోళికంగా రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉండడం వలనే నర్మదానది తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుంది. సాధారణ పదాలలో అర్థం చేసుకోవడానికి, నది వాలు దాని ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. వాలు కారణంగా ఈ నది ప్రవాహం రివర్స్ అవుతుంది. ఇది గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రధాన నది.

– నర్మద అనేక విధాలుగా ప్రత్యేకమైనది

* నర్మదా నదిని మధ్యప్రదేశ్, గుజరాత్‌ల జీవనాడి అని పిలవడంతో పాటు కొన్ని ప్రదేశాలలో రేవా నది అని కూడా పిలుస్తారు.

* ఇది భారతదేశంలో 5వ పొడవైన నది, ఇది మొత్తం 1077 కి.మీ.

* శివుని 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వరాలయం నర్మదా నది ఒడ్డున ఉంది.

* నర్మదా జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని అనుప్ పూర్ జిల్లాలోని అమర్ కంటక్. ఈ నది శతాబ్దాలుగా సంస్కృతిని పెంచి పోషిస్తూ లెక్కలేనన్ని ఇతిహాసాలకు జన్మనిచ్చింది.

* నర్మదా నదీ పరీవాహక ప్రాంతం 98,796 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.

* తప్తి, మహి, సబర్మతి లుని, అనేక చిన్న నదులు కూడా పశ్చిమం వైపు ప్రవహిస్తాయి. కానీ అరేబియా సముద్రంలో కలిసే ఏకైక ప్రధాన నది నర్మదా.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..