టైర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృ**తి..
అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ముత్తంగి దాబాలో భోజనం చేద్దామని బయలు దేరారు. ఇందులో భాగంగానే సుల్తాన్‌పూర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి కాసేపు ప్రయణించారు. అయితే సందీప్ రెడ్డి కుమారుడు ఆరేళ్ల మోక్షిత్ రెడ్డి కాసేపటికే మూత్ర విసర్జన కోసం అడగ్గా కారును రోడ్డు పక్కన ఆపారు.
అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ముత్తంగి దాబాలో భోజనం చేద్దామని బయలు దేరారు. ఇందులో భాగంగానే సుల్తాన్‌పూర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి కాసేపు ప్రయణించారు. అయితే సందీప్ రెడ్డి కుమారుడు ఆరేళ్ల మోక్షిత్ రెడ్డి కాసేపటికే మూత్ర విసర్జన కోసం అడగ్గా కారును రోడ్డు పక్కన ఆపారు. అనంతరం బాలుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలోనే ఎక్కడి నుంచో ఓ టైర్ అత్యంత వేగంగా దూసుకొచ్చి, బాలుడిని వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి అమాంతం అంత దూరం ఎగిరి పడ్డాడు మోక్షిత్. తీవ్ర గాయాలైన మోక్షిత్‌ను తల్లిద్రండులు వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో మరో ఆసుపత్రికి బాలుడిని తీసుకెళ్లాలని వైద్యుడు సూచించాడు. దీంతో హుటాహుటిన మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు. బాలుడు చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచాడు. అయితే ఆ టైర్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఓఆర్‌ఆర్‌పై ఏదైనా వాహనం టైర్ ఊడిపోయి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

