26 మంది హ**త్య !! మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు
పపువా న్యూగినియాలో సాయుధ గ్యాంగ్‌లు విజృంభిస్తున్నాయి. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఓ మారుమూల మూడు గ్రామాల్లో దాదాపు 26 మందిని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు ఐక్యరాజ్యసమితి, ఆ దేశ పోలీసు వర్గాలు తెలిపాయి. దేశంలోని ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ మాట్లాడుతూ అది చాలా భయంకరమైన ఘటన అనీ మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారనీ దాదాపు 30 మంది సాయుధులు వారిని హత్య చేశారని అన్నారు.
పపువా న్యూగినియాలో సాయుధ గ్యాంగ్‌లు విజృంభిస్తున్నాయి. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఓ మారుమూల మూడు గ్రామాల్లో దాదాపు 26 మందిని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు ఐక్యరాజ్యసమితి, ఆ దేశ పోలీసు వర్గాలు తెలిపాయి. దేశంలోని ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ మాట్లాడుతూ అది చాలా భయంకరమైన ఘటన అనీ మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారనీ దాదాపు 30 మంది సాయుధులు వారిని హత్య చేశారని అన్నారు. కొన్ని మృతదేహాలు గ్రామాల్లో కుళ్లిపోయే స్థితికి వచ్చాయని.. మరికొన్నింటిని రాత్రి వేళల్లో మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లిపోయాయని బౌగెన్ తెలిపారు. చాలామందిని తలలు నరికి హత్య చేశారనీ మృతుల్లో చాలామంది తల్లీ పిల్లలేనని పేర్కొన్నారు. 16 మంది చిన్నారులు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ గ్రామంల్లోని ఇళ్లకు కూడా దుండగులు నిప్పంటించినట్లు అధికారులు చెప్పారు. దీంతో చాలామంది గ్రామస్థులు పోలీసుల రక్షణలో జీవిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. సాధారణంగా పపువా న్యూగినియాలో భూవివాదాలే ఈ స్థాయి హత్యలకు కారణమవుతాయని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల పొట్టల్లో కొకైన్.. డ్రగ్స్‌తో బ్రెజిల్ తీరం కలుషితం
TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ‘డెవిల్’ కోసం మహేష్.. కానీ డైరెక్టరే..!| ఫారెన్ అమ్మాయితో దేవరకొండ
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. డైరెక్టర్ చేసిన పనికి షాకైన హీరోయిన్..
Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

