Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!

Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!

Phani CH

|

Updated on: Jul 27, 2024 | 12:13 PM

బాలీవుడ్ భామ మలైకా అరోరా ఎప్పుడూ వృత్తిపరంగా కాకుండా, వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సల్మాన్ ఖాన్ సొదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లైన 19 ఏళ్ల తర్వాత తన భర్త అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుంది. ఆ తరువాత హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. చాలా కాలంపాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఫంక్షన్స్, పార్టీలలో పాల్గొన్నారు.

బాలీవుడ్ భామ మలైకా అరోరా ఎప్పుడూ వృత్తిపరంగా కాకుండా, వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సల్మాన్ ఖాన్ సొదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లైన 19 ఏళ్ల తర్వాత తన భర్త అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుంది. ఆ తరువాత హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. చాలా కాలంపాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఫంక్షన్స్, పార్టీలలో పాల్గొన్నారు. అదే సమయంలో ఇద్దరి వయసు వ్యత్సాసం గురించి అనేక ట్రోలింగ్స్ జరగ్గా.. తమదైన శైలిలో స్పందించారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే టాక్ నడుస్తుంది. అర్జున్‌తో మలైకా విడిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అర్జున్, మలైకా ఇద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే మలైకా చేసిన ఓ పోస్ట్‌.. ఇప్పుడు ఈ బ్యూటీ ముచ్చటగా మూడో సారి ప్రేమలో పడిందా ఏంటి? అనే డౌట్ తన ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లలో కలిగిస్తోంది. ఎస్ ! ఓవైపు సోషల్ మీడియాలో బ్రేకప్ వదంతులు చక్కర్లు కొడుతుండగా.. ఓ మిస్టరీ మ్యాన్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది మలైకా. దీంతో ఈ బ్యూటీ మూడోసారి ప్రేమలో పడినట్లు ఓ టాక్ బయటికి వచ్చింది. దానికితోడు.. ‘ప్రతి ఆనందం… ప్రేమపూర్వకమైన పదం… ప్రతి చర్య మన ఆత్మ సౌందర్యానికి ప్రతిబింబం.’ అంటూ ఇన్ స్టాలో మలైకా చేసిన పోస్ట్.. ఇప్పుడు ప్రూఫ్‌గా మారింది. పక్కాగా ఈమె ప్రేమలో పడిందనే కామెంట్ సోషల్ మీడియాలో వస్తోంది. అది కాస్త తెగ వైరలవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!

తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన

పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. గూబగుయ్‌మనే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్

Shah Rukh Khan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం

Bellamkonda Sreenivas: ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు