AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soya Dosa: డయాబెటీస్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో మళ్లీ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్‌ రెసిపీలు ఉన్నాయి. వాటిల్లో సోయా దోశ ఒకటి. ఈ దోశలు తినడం వల్ల ఎనర్జీతో పాటు..

Soya Dosa: డయాబెటీస్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!
Soya Dosa
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 30, 2024 | 7:15 PM

Share

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో మళ్లీ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్‌ రెసిపీలు ఉన్నాయి. వాటిల్లో సోయా దోశ ఒకటి. ఈ దోశలు తినడం వల్ల ఎనర్జీతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం. అంతే కాకుండా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు ఎప్పుడూ ఒకేసారి తనకూడదు. దీని వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. మరి ఈ సోయా దోశ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సోయా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:

సోయా పాలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, బేకింగ్ సోడా, జీలకర్ర, ఉప్పు, ఆయిల్.

ఇవి కూడా చదవండి

సోయా దోశ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో గోధుమ పిండి, సోయా పాలు వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులో పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, బేకింగ్ సోడా, జీలకర్ర, ఉప్పు, వాటర్ వేసి దోశ బాటర్‌లలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ పావు గంట సేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు పెనం పెట్టి.. ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కాక దోశలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి.. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సోయా దోశ సిద్ధం. ఈ దోశలను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పప్పు చట్నీ, సాంబార్, కర్రీస్ ఇలా వేటితో అయినా తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!