AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indoor Plants: ఎయిర్ ప్యూరిఫై మొక్కలు ఇవే.. ఇంట్లో వీటిని పెంచుకుంటే అందంతో పాటు స్వచ్చమైన గాలి మీ సొంతం..

మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇంటి ఆవరణతో పాటు కొంతమంది ఇంటి పై పైకప్పులపై కూడా రకరకాల మొక్కలను పెంచుకుంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు అని మీకు తెలుసా.. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వలన అందం మాత్రమే కాదు.. గాలిని కూడా శుభ్రం చేసి మీకు స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి.

Indoor Plants: ఎయిర్ ప్యూరిఫై మొక్కలు ఇవే.. ఇంట్లో వీటిని పెంచుకుంటే అందంతో పాటు స్వచ్చమైన గాలి మీ సొంతం..
Air Purifying Plants
Surya Kala
|

Updated on: May 10, 2025 | 9:55 PM

Share

నేటి అనారోగ్యకరమైన జీవన శైలి, బిజీ బిజీ జీవితంలో ప్రజలు సాధారణంగా తమ ఇల్లు ప్రశాంతంగా, తాజాదనంతో నిండి ఉండాలని కోరుకుంటారు. అయితే అలంకరణ మాత్రమే ఇంటిని అందంగా ఉంచదు. ఇంట్లో పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలి కూడా అంతే ముఖ్యమైనది. స్వచ్ఛమైన గాలి కోసం ఖరీదైన ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంది. అయితే ప్రకృతిలోని మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచడమే కాదు స్వచ్చమైన గాలిని కూడా అందిస్తాయి.

ఇలాంటి మొక్కలను ఇంటి లోపల పెంచుకోవచ్చు. వాటిని పెంచడం చాలా సులభం. పైగా అవి గాలిలో ఉండే హానికరమైన మూలకాలను (కార్బన్ డయాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటివి) గ్రహిస్తాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు మీ గది, బాల్కనీ లేదా ఆఫీస్ మూలను తాజాదనం, పచ్చదనంతో నింపవచ్చు. కనుక ఈ రోజు ఇంటిని అందంగా మార్చడమే కాదు ఇంట్లో గాలిని శుద్ధి చేసే అద్భుతమైన మొక్కల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

స్నేక్ ప్లాంట్: ఈ మొక్క చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. తక్కువ వెలుతురులో కూడా సులభంగా జీవించగలదు. ఇది రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. గాలి నుంచి విషాన్ని తొలగిస్తుంది. దీనిని తక్కువ నీరుతోనే పెంచుకోవచ్చు. కనుక ఈ మొక్కను పెంచడం చాలా సులభం. వారానికి ఒకసారి నీరు పెట్టినా పెరుగుతుంది,

ఇవి కూడా చదవండి

మనీ ప్లాంట్: ఇంటి అలంకరణకు మనీ ప్లాంట్ అత్యంత ప్రాచుర్యం పొందిన మొక్కలలో ఒకటి. ఇది గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి హానికరమైన వాయువులను శుభ్రపరుస్తుంది. దీన్ని సీసా లేదా కుండలో నీరు పోసి సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్కకు కూడా ఎక్కువ నీరు, వెలుతురు అవసరం ఉండదు.

కలబంద: కలబంద చర్మానికి, జుట్టుకు మేలు చేయడం మాత్రమే కాదు గాలిని కూడా శుద్ధి చేస్తుంది. ఇది గాలి నుంచి బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను తొలగిస్తుంది. దీనిని కొంచెం ఎండలో కూడా పెంచవచ్చు. ఎక్కువ నీరు పెట్టకూడదు.

పీస్ లిల్లీ: ఈ పీస్ లిల్లీ మొక్క అందమైన తెల్లని పువ్వులతో ఇంటి అందాన్ని పెంచుతుంది. నివేదిక ప్రకారం ఇది ఒక అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇండోర్ గాలి లోని బూజు బీజాంశాలను, ఇతర అలెర్జీ కారకాలను తొలగిస్తుంది. ఇది తేలికపాటి సూర్యకాంతికి కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. కనుక ఈ మొక్కను బాల్కనీలో పెంచుకోవడం సరైన ఎంపిక.

అరేకా పామ్: ఈ మొక్క ఇల్లు లేదా ఆఫీసు అలంకరణకు చాలా మంచిది. ఇది గదిలోని తేమను నిలుపుకుంటుంది. గాలిని తాజాగా చేస్తుంది. దాని ఆకులు మెల్లగా వీచే గాలికి కదులుతూ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మొక్కను వెలుతురులో ఉంచి.. మొక్క పెరిగే నేలను తేమగా ఉంచాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)