Shani Jayanti: శని జయంతి రోజున అరుదైన యోగం.. 7 నిముషాలు మాత్రమే.. ఈ సమయంలో చేసే పరిహారాలతో శని అనుగ్రహం మీ సొంతం..
నవ గ్రహాలకు అధినేత ప్రత్యక్ష దైవం సూర్య నారాయుడు చాయల తనయుడు శనీశ్వరుడు. హిందువులు కర్మ ఫలదాత జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈసారి శని జయంతి ప్రత్యేకమైనది. ఎందుకంటే శని జయంతి రోజున అరుదైన యోగం కేవలం 7 నిమిషాలు మాత్రమే ఏర్పడుతుంది. ఇది శనిశ్వర ఆగ్రహం నుంచి రక్షిస్తుంది. ఆ యోగం ఎప్పుడు ఏర్పడుతుంది తెలుసుకుందాం..

శని జయంతి అనేది హిందువులు జరుపుకునే ఒక పవిత్ర పండుగ. దీనిని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. న్యాయం, కర్మలకు దేవుడైన శనీశ్వరుడిని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. శని జయంతి అనేది భక్తులు శనీశ్వరుడిని పూజించడానికి.. శనిశ్వరుడి ఆగ్రహం నుంచి రక్షణ పొందేందుకు మరియు నిజమైన భక్తితో శనిశ్వరుడి అనుగ్రహం పొందేందుకు ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది.
సనాతన ధర్మంలో శని జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి ఈ రోజున జరుగుతున్న అనేక శుభ యాదృచ్చికాల కారణంగా ఇది మరింత ప్రత్యేకంగా మారింది. ఈ పండుగ న్యాయ దేవుడు శని దేవునికి అంకితం చేయబడింది. ఈ శుభ సందర్భంగా భక్తులు కర్మ ప్రదాత అయిన శని దేవుడిని పూజిస్తారు. ఉపవాసం కూడా పాటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు కేవలం 7 నిమిషాలు మాత్రమే వచ్చే యోగా ఏమిటి తెలుసుకుందాం..
శని జయంతి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం శని జయంతి 2025 మే 27న జరుపుకోనున్నారు. పురాతన గ్రంథాల ప్రకారం, సూర్య భగవానుడి కుమారుడైన శని దేవుడు ఈ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య నాడు శని జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున, దేవాలయాలలో శనిశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
శని జయంతి నాడు శుభ సమయం
వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమై మే 27న ఉదయం 8:31 గంటలకు ముగుస్తుంది.
ఈ ప్రత్యేక యోగా కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉంటుంది.
వైశాఖ మాసం అమావాస్య అంటే శని జయంతి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. సుకర్మ యోగం ఉదయం నుంచి రాత్రి 10:54 వరకు ఉంటుంది. ఆ తర్వాత ధృతి యోగం ఏర్పడుతుంది, ఉదయం 5:25 నుంచి ఉదయం 5:32 వరకు అంటే ఏడు నిమిషాలు అరుదైన సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంటుంది. ఈ యోగా కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ ప్రత్యేక యోగాలో పూజ చేయడం ద్వారా మీరు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీనితో పాటు శివవాస యోగం కూడా ఉదయం 8:31 గంటల వరకు ఉంటుంది. ఈ శివవాస యోగ సమయంలో శివుడు పార్వతి దేవితో కలిసి కైలాస పర్వతంపై నివసిస్తాడని నమ్ముతారు.
పంచాంగం ప్రకారం శుభ యోగ సమయాలు
- సూర్యోదయం ఉదయం 5:23
- సూర్యాస్తమయం రాత్రి 7:12
- చంద్రాస్తమయం రాత్రి 7:49
- బ్రహ్మ ముహూర్తం 4:03 AM నుంచి 4:44 AM వరకు
- విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:36 నుంచి 3:31 వరకు
- సంధ్యా ముహూర్తం రాత్రి 7:11 నుంచి 7:31 వరకు
- నిశిత ముహూర్తం 11:58 PM నుంచి 12:39 AM వరకు
ఈ రోజున శనీశ్వర అనుగ్రహం ఎలా పొందాలి?
ఈ రోజున కర్మ ప్రదాత అయిన శనీశ్వరడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, పూజలతో పాటు దానధర్మాలు చేయాలి. మరోవైపు జాతకంలో శని దోషం ఉన్నవారు లేదా ఏలినాటి శని లేదా ధైయ్య ప్రభావంతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా శనీశ్వరడికి పరిహారాలు చేయాలి. ఈ రోజున దాన ధర్మాలు చేయాలి. జమ్మి, రావి చెట్లను పూజించాలి. నీడను దానం చేయాలి. శనీశ్వరడికి నువ్వులు, నూనెతో అభిషేకం చేయాలి. అలాగే వికలాంగులకు, వృద్ధులకు సేవ చేయండి. శనీశ్వరడిని పూజించడం ద్వారా వ్యక్తి తన కోరిక మేరకు జీవితంలో విజయం సాధిస్తాడని, అన్ని రకాల దుఃఖాలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. శివుడిని పూజించడం ప్రార్థించడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.