Cinema : ఒక్క సినిమా ఆ హీరో లైఫ్ మార్చేసింది.. 34 ఏళ్ల క్రితం థియేటర్లు దద్దరిల్లిపోయాయ్.. దివ్య భారతి హీరోయిన్..
90వ దశకంలో విడుదలైన ఒక సినిమా అతడిని సూపర్ స్టార్ ను చేసింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో సరికొత్త సెన్సెషన్ అయ్యింది. 1994ల నాటి కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. అతడి తలరాతను శాశ్వతంగా మార్చేసింది. అతని శక్తివంతమైన నటనను ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ ఎంతగానో ప్రశంసించారు. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా దీవానా. 1992లో వచ్చిన ఈ మూవీతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రాజ్ కన్వర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ విడుదలై 34 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 25న విడుదలైంది. కానీ ఈ చిత్రానికి షారుఖ్ ఖాన్ మొదటి ఎంపిక కాదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పాత్రను మరో బాలీవుడ్ నటుడికి ఆఫర్ చేశారు. నిజానికి ఈ సినిమాకు ముందుగా రిషి కపూర్‌ను సంప్రదించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయనే ఆయన మొదటి ఎంపిక. కానీ ఆ సమయంలో ఆయన స్టార్‌డమ్ పీక్స్ లో ఉంది. దీంతో ఆ పాత్రకు గాను ఆయనకు సుమారు 10 లక్షల రూపాయల భారీ పారితోషికం చెల్లించారు. అలాగే ఈ చిత్రంలో కథానాయికగా నిర్మాతలు మొదట మాధురీ దీక్షిత్‌ను ఎంచుకున్నారు.
అప్పుడప్పుడే ఆమెకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వస్తుంది. వరుస ఆఫర్లతో ఆమె తీరిక లేని షెడ్యూల్ , డేట్స్ లేకపోవడం వల్ల, ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారు. నిర్మాత గుడ్డు ధనోవాకు సన్నిహితుడైన జతిన్ రాజ్‌గురు సిఫార్సు మేరకు దివ్య భారతిని ఎంపిక చేశారు. రిషి కపూర్, దివ్య భారతి ఖరారైన తర్వాత, రెండవ కథానాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. షారుఖ్ ఖాన్‌కు ముందు, సన్నీ డియోల్, అనిల్ కపూర్, గోవింద, దక్షిణాది సూపర్ స్టార్ నాగార్జున వంటి పెద్ద పేర్లు వినిపించాయి. చివరికి, ఆ పాత్ర అర్మాన్ కోహ్లీకి దక్కింది. అర్మాన్ ఆ సినిమాకు సంతకం చేసి, కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే, నిర్మాత లలిత్ కపూర్ భార్య షబ్నం కపూర్‌తో వివాదం కారణంగా, అర్మాన్ హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.
అర్మాన్ కోహ్లీ సినిమా నుండి తప్పుకున్న తర్వాత, నిర్మాతలు కొత్త ముఖం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇస్తున్నాడు. అప్పటికే ‘సర్కస్’, ‘దిల్ దరియా’ వంటి టీవీ సీరియల్స్‌తో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. దర్శకుడు రాజ్ కన్వర్ షారుఖ్ నటనను గమనించి, అతని స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత రాజ్ కన్వర్ నిర్మాతలకు షారుఖ్ ఖాన్ పేరును సూచించగా, అతన్ని ఆ సినిమాలో తీసుకున్నారు. ఆ కాలం షారుఖ్ ఖాన్‌కు కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఆయన ఏకకాలంలో ‘దీవానా’ ‘రాజూ బన్ గయా జెంటిల్‌మన్’ చిత్రాల షూటింగ్‌లో ఉన్నారు. ‘రాజూ బన్ గయా జెంటిల్‌మన్’ షారుఖ్ మొదటి విడుదల అవుతుందని, దానితో ఆయన బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. కానీ విధి మరోలా తలచింది. ‘దీవానా’ ముందుగా విడుదలై, షారుఖ్ అధికారిక అరంగేట్ర చిత్రంగా నిలిచింది.
‘దీవానా’ సినిమాలో షారుఖ్ ఖాన్ నటన, విలక్షణమైన శైలిక్తితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. రిషి కపూర్, దివ్య భారతి వంటి అగ్రశ్రేణి నటుల మధ్య కూడా అతను చెరగని ముద్ర వేయగలిగాడు. అతడి నటనకు గాను అతనికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ పురుష తొలి పరిచయ పురస్కారం లభించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. గత మూడు దశాబ్దాలుగా ఆయన బాలీవుడ్‌ను ఏలుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
