‘మమ్మల్ని వదిలేయండి, భారత్‌తో కలుస్తాం’.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మిన్నంటిన నిరసనలు.. !
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా తిరుగుబాటు గురువారం (జూన్ 25, 2026) నాటికి 16వ రోజుకు చేరుకుంది. పాకిస్తాన్ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా, PoKకి విముక్తి కావాలంటూ రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో 50,000 మందికి పైగా నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. ముఖ్యంగా అక్కడి మహిళలు తమను నిలువునా దోచుకుంటున్న పాకిస్తాన్ నుండి విడిపోయి, భారతదేశంతో చేతులు కలపాలని బహిరంగంగా పిలుపునివ్వడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రానిమా షాజ్మా ఒక వీడియోను విడుదల చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ సైన్యం స్థానిక ఇళ్లను దోచుకుంటూ, ప్రజలను హింసిస్తున్న తీరును బట్టి PoK ప్రజలు భారతదేశంతో చేతులు కలపడమే మంచిదని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ PoK ప్రజల పక్షాన నిలబడలేదని, ఎప్పటికీ నిలబడబోదని ఆమె మండిపడ్డారు.
మరోవైపు అవామీ యాక్షన్ కమిటీ సభ్యుడు సర్దార్ అమన్ ఖాన్ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాక్ సైన్యం కాశ్మీర్‌ను విడిచిపెట్టాలని, ఈ భూభాగాన్ని కాశ్మీరీలకు తిరిగి ఇచ్చి వారిని భారతదేశానికి వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు. రిగ్గింగ్ ఎన్నికల ద్వారా గెలిచిన కీలుబొమ్మ ఎమ్మెల్యేలు తమకు వద్దని ఆయన హెచ్చరించారు.
ఈ తిరుగుబాటును అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం క్రూరమైన చర్యలకు పాల్పడుతోంది. గత 16 రోజుల్లో సైన్యం జరిపిన కాల్పుల్లో 58 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. నిరసనల నిర్వాహకులను, వీరికి మద్దతు ఇస్తున్న 150 మందిని పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. అంతేకాకుండా, నిరసనల్లో పాల్గొన్నారనే నెపంతో ఫైసల్ ముంతాజ్ రాథోడ్ నేతృత్వంలోని PoK కీలుబొమ్మ ప్రభుత్వం 128 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించింది. నిరసనల్లో కనిపిస్తే పెన్షన్లు నిలిపివేస్తామని రిటైర్డ్ సైనికులను సైతం బెదిరిస్తోంది.
ప్రజలను లొంగదీసుకోవడానికి పాకిస్తాన్ సైన్యం PoK సరిహద్దులను మూసివేసింది. గత 10 రోజులుగా ఆహార పదార్థాల ట్రక్కులను నిలిపివేసింది. దీనివల్ల అక్కడ తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బుధవారం (జూన్ 24, 2026) పార్లమెంటులో తీవ్ర నిరాశతో మాట్లాడారు. రావల్‌కోట్ ప్రజలను తాను కాశ్మీరీలుగా పరిగణించనని, వారు కాశ్మీరీ భాష కూడా మాట్లాడరని వ్యాఖ్యానించారు. “మేము PoK కోసం ఐదు యుద్ధాలు చేశాం, కానీ మాకు దక్కిన ప్రతిఫలం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దూషణలు, నిరసనలు మాత్రమే” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, 1948లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్, స్థానిక జనాభా సమతుల్యతను దెబ్బతీయడానికి పంజాబీ, ఉర్దూ మాట్లాడే వారిని అక్కడ స్థిరపరిచింది. అయితే, జూన్ 9న ప్రారంభమైన ఈ తిరుగుబాటు.. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి తరహాలో PoKకి పాక్ చెర నుండి విముక్తి కలిగిస్తుందా? లేదా సైన్యం తూటాలతో ఈ గొంతులను నొక్కేస్తుందా? అనేది వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..