Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Brain Tumor Day 2024: ప్రమాదకరమైన ట్యూమర్ నుంచి మీ బ్రెయిన్‌ని కాపాడుకోండిలా..

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మెదడని చెప్పొచ్చు. బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మెదడును కాపాడుకుంటూ ఉండాలి. ఏ చిన్న దెబ్బ తగిలినా.. ప్రమాదమే. అలాగే బ్రెయిన్‌కి వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల్లో ట్యూమర్ ఒకటి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే.. వ్యక్తి బ్రతుకుతాడన్న నమ్మకం ఉండదు. అంత డేంజరస్ వ్యాధి ఈ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్‌‌ వచ్చిందంటే..

World Brain Tumor Day 2024: ప్రమాదకరమైన ట్యూమర్ నుంచి మీ బ్రెయిన్‌ని కాపాడుకోండిలా..
World Brain Tumor Day 2024
Follow us
Chinni Enni

|

Updated on: Jun 08, 2024 | 2:34 PM

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మెదడని చెప్పొచ్చు. బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మెదడును కాపాడుకుంటూ ఉండాలి. ఏ చిన్న దెబ్బ తగిలినా.. ప్రమాదమే. అలాగే బ్రెయిన్‌కి వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల్లో ట్యూమర్ ఒకటి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే.. వ్యక్తి బ్రతుకుతాడన్న నమ్మకం ఉండదు. అంత డేంజరస్ వ్యాధి ఈ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్‌‌ వచ్చిందంటే.. ఎప్పుడు ఎలా ప్రాణాలు కోల్పోతామో తెలీదు. ఇంత ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మెదుడలోని కణితులు ఏర్పడతాయి. ఇవి బ్రెయిన్ పని తీరుకు ఆటంకం ఏర్పడుతాయి. వీటి వల్ల మతి మరుపు ఏర్పడటం, ఏకాగ్రత నశిచండం, నకడలో ఇబ్బందులు, తల నొప్పి ఎక్కువగా రావడం, ప్రవర్తనలో మార్పులు, నాడీ సమస్యలు వస్తాయి. ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి.. సరైన చికిత్స్ తీసుకోకపోతే.. ప్రాణానికే ప్రమాదమని చెప్పొచ్చు.

బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు.. అవి వచ్చిన భాగాలను బట్టి మారవచ్చు. కణితి మెదడు మీద చురుకుగా లేని భాగాల్లో ఎదిగితే.. కణితి చాలా పెద్దిగా పెరిగే వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. మెదడు కణితులు మెదడు కణజాలంలో పుట్టవచ్చు. ఈ కణితులు అనేవి శరీరంలోని ఏ భాగంలో వచ్చినా.. బ్రెయిన్‌కు వ్యాపిస్తాయి. దీన్నే మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు.

బ్రెయిన్ ట్యూమర్‌ డే ఎప్పుడు వచ్చింది?

చాలా మందికి ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి సరైన అవగాహన లేదు. చివరిలో ఈ విషయం గురించి తెలిసినా.. అప్పటికే ఆలస్యమై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ బాధితులకు అవగాహాన కల్పించడంలో జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేను తీసుకొచ్చారు. 2000 సంవత్సరం నుంచి ఇది ప్రారంభమైంది. చికిత్స తీసుకోవాలంటే ముందుగా కణితిని గుర్తించడం చాలా ముఖ్యం. అలాగే మీ శరీరంలో వచ్చే ప్రతీ మార్పును కూడా గమనించండి. ఈ క్యాన్సర్ కణితులను ప్రమాదం కాకముందే.. వెంటనే పరిష్కరించాలి. ఇలా బ్రెయిన్ ట్యూమర్‌పై అవగాహన కల్పించడానికే ప్రత్యేకంగా.. బ్రెయిన్ ట్యూమర్ డే‌ను తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ బ్రెయిన్ ట్యూమర్ ఎవరెవరికి వస్తుంది:

బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎవరికైనారావచ్చు. ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబంలో తల్లి, తండ్రి, తాతలకు ఉంటే.. మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు నుంచే ట్యూమర్ నియంత్రించే ఫుడ్స్ తీసుకోవడం మంచిది. చెడు ఆహారాలు తినడం వల్ల కూడా బ్రెయిన్ పనితీరు అనేది తగ్గుతుంది. అలాగే ఇంట్లో ఉపయోగించే నాన్ స్టిక్ పాత్రలకు దూరంగా ఉండటం, సరైన ఆహారపు అలవాట్లు ఎంచుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

శని మహాదశ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
శని మహాదశ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
సంకటహర చతుర్థి.. కష్టాలు తీర్చే గణపతి పూజ.. ఫలితాలివే!
సంకటహర చతుర్థి.. కష్టాలు తీర్చే గణపతి పూజ.. ఫలితాలివే!
10th సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా..
10th సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా..
జగన్నాథునికి వేప పొడిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
జగన్నాథునికి వేప పొడిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
థియేటర్‌లో డాన్స్‌తో రచ్చ చేసిన నవీన్ చంద్ర..
థియేటర్‌లో డాన్స్‌తో రచ్చ చేసిన నవీన్ చంద్ర..
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
UPSC సివిల్‌ సర్వీసెస్ 2025కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు ఇలా చేయండి
UPSC సివిల్‌ సర్వీసెస్ 2025కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు ఇలా చేయండి
శనివారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
శనివారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం.. తులం ధర 1 లక్షా 20 వేల చేరవలో..
రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం.. తులం ధర 1 లక్షా 20 వేల చేరవలో..