BP: బీపీ నార్మల్‌గానే ఉంది కదా అని ఉప్పు ఎక్కువ తింటున్నారా.?

ఇక ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుందని మనందరికీ తెలిసిందే. అందుకే బీపీ పెరిగిన వారిని వైద్యులు ఉప్పును తక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే బీపీ నార్మల్‌గా ఉన్న వారు మాత్రం మాకేం టెన్షన్‌ లేదు ఉప్పు ఎక్కువగా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదని భావనలో ఉంటారు. మీరు కూడా ఇదే ఫీలింగ్‌లో ఉన్నారా.?

BP: బీపీ నార్మల్‌గానే ఉంది కదా అని ఉప్పు ఎక్కువ తింటున్నారా.?
Salt
Follow us

|

Updated on: Jun 08, 2024 | 2:23 PM

అధిక రక్తపోటు.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలోనే ఎక్కువగా ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం జీవన విధానంలో మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు బీపీ సమస్య బారినపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల రీత్యా నైటి ఫిఫ్ట్స్‌లో పనిచేయడం, బయటి ఫుడ్‌ తీసుకోవడం కారణంగా బీపీ పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుందని మనందరికీ తెలిసిందే. అందుకే బీపీ పెరిగిన వారిని వైద్యులు ఉప్పును తక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే బీపీ నార్మల్‌గా ఉన్న వారు మాత్రం మాకేం టెన్షన్‌ లేదు ఉప్పు ఎక్కువగా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదని భావనలో ఉంటారు. మీరు కూడా ఇదే ఫీలింగ్‌లో ఉన్నారా.? అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు నార్మల్‌గా ఉన్న వారు కూడా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె, మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

స్వీడన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. అధిక రక్తపోటు రావడానికి కంటే ముందే ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాలు దెబ్బతింటున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఉప్పుతో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెకు చేటు చేస్తుంది. కానీ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటంలో ఉప్పు పాత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికే స్వీడన్‌ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడానికి, రక్తనాళాల్లో పూడికల మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే పూడికల ముప్పు అంత ఎక్కువగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధిక రక్తపోటు లేకపోయినా ఉప్పు అధికంగా వాడేవారిలో పూడికల ఆనవాళ్లు కనిపిస్తుండటమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. అంటే కేవలం అధిక రక్తపోటు ఉన్న వారు మాత్రమే కాకుండా ఇతరులు సైతం ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఒక చెంచా కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్