- Telugu News Photo Gallery Ginger Effects: excessive consumption of ginger can cause several health problems
Ginger: మంచిదని అల్లం ఎక్కువగా తింటున్నారా..? పెను ప్రమాదంలో పడినట్లే..
అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. దీనిని తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. అల్లంలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఫాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.. అల్లం పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ అధిక వినియోగం..
Updated on: Jun 08, 2024 | 1:54 PM

అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. దీనిని తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. అల్లంలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఫాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.. అల్లం పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ అధిక వినియోగం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్లం అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి..

తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతుంటే, ఆహారంలో అల్లం పరిమితంగా తీసుకోవాలి. ఇది రక్తాన్ని పలుచన చేసే గుణాలను కలిగి ఉండి.. బీపీ సమస్యలతో బాధపడేవారికి సమస్యలను కలిగిస్తుంది.

అల్లం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ వస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. వేసవిలో చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి అల్లం పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

వాస్తవానికి, అల్లం వినియోగం గుండెకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమి, క్రమరహిత హృదయ స్పందన వంటి సమస్యలు తలెత్తుతాయి. వేసవిలో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచుతుంది.

వేసవిలో అల్లం ఎక్కువగా వాడటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. కళ్ళు చుట్టూ వాపు, ముఖం మీద దురద లేదా మొఖంపై ఎరుపు లాంటి దద్దుర్లు ఏర్పడవచ్చు.. అంతేకాకుండా, ఇది గుండెలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. గొంతు నొప్పిని కలిగిస్తుంది.




