- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary demands huge remuneration for her upcoming movies Telugu Actress Photos
Meenakshi Chaudhary: సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న ఆ ముద్దుగుమ్మ.. ఏంటి ఇంత చేంజ్.?
ఇండస్ట్రీలో ఎవర్నీ ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నానంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు. విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు నటిస్తూ.. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా..? కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది.
Updated on: Jun 08, 2024 | 4:42 PM

ఇండస్ట్రీలో ఎవర్నీ ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నానంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు.

విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు నటిస్తూ.. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా..? కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది.

ఇప్పుడు మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.

కానీ రెండూ ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ 2 హిట్టైనా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. శ్రీలీల జోరు కాస్త తగ్గుతుండటంతో ఇప్పుడు మీనాక్షి పేరు గట్టిగా వినిపిస్తుంది.

పైగా మొన్న గుంటూరు కారంలో శ్రీలీలతో పాటు నటించారు ఈ బ్యూటీ. ఇంపార్టెన్స్ లేని కారెక్టర్ ఇచ్చినా బాగానే రిజిష్టర్ అయ్యారు ఈ భామ. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి. తెలుగుతో పాటు తమిళంలోనూ దున్నేస్తున్నారు.

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్‌తో పాటు విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ.. వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి.

ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న GOATలోనూ మీనాక్షే హీరోయిన్. సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది.




