AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking in AC: ఏసీ రూమ్‌లో స్మోకింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!

స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికి కాల్చే సిగరెట్ బాక్సులపై కూడా ఈ విషయాన్ని చెబుతారు. కానీ చాలా మంది స్మోకింగ్ చేస్తున్నారు. స్మోకింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. స్మోకింగ్ చేయడం వల్ల ప్రాణాల మీదకు వస్తుందని, చనిపోతారని కూడా తెలుసు. కానీ ఎవరూ లెక్క చేయడం లేదు. స్మోకింగ్ మాత్రమే కాదు..

Smoking in AC: ఏసీ రూమ్‌లో స్మోకింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!
Smoking in AC
Chinni Enni
|

Updated on: Jun 03, 2024 | 3:04 PM

Share

స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికి కాల్చే సిగరెట్ బాక్సులపై కూడా ఈ విషయాన్ని చెబుతారు. కానీ చాలా మంది స్మోకింగ్ చేస్తున్నారు. స్మోకింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. స్మోకింగ్ చేయడం వల్ల ప్రాణాల మీదకు వస్తుందని, చనిపోతారని కూడా తెలుసు. కానీ ఎవరూ లెక్క చేయడం లేదు. స్మోకింగ్ మాత్రమే కాదు.. మద్యం సేవించడం, గంజాయి తీసుకోవడం కూడా చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయవద్దని ప్రభుత్వం ప్రకటనలు కూడా చేస్తుంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

చాలా ప్రమాదం..

స్మోకింగ్ చేయడాన్ని ఫ్యాషన్‌గా తీసుకుంటున్నారు. మొదట్లో ఒక సిగరెట్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత ప్యాకెట్లు ప్యాకెట్లు చొప్పున పీల్చేస్తున్నారు. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. ఏసీ గదుల్లో సైతం ధూమ పానం చేస్తున్నారు. ఏసీ గదుల్లో స్మోకింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల కలిగే నష్టాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

నష్టం రెట్టింపు..

స్మోకింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలు పోతాయన్న విషయం తెలిసి కూడా.. ఆ వ్యసనం నుంచి బయట పడలేక పోతున్నారు. చాలా మంది ఇంట్లోనే మామూలు గదుల్లో సైతం కూర్చుని తెగ పీల్చేస్తారు. అలాగే ఏసీ ఉన్నా కూడా లెక్క చేయరు. ఏసీ ఉన్న గదుల్లో ధూమ పానం చేయడం వల్ల కలిగే నష్టం రెట్టింపు ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. ఏసీ గదుల్లో స్మోకింగ్ అస్సలు చేయకూడదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ శరీర భాగాలు పని చేయవు..

ఏసీ గదుల్లో స్మోకింగ్ చేయడం వల్ల.. శరీరం నుంచి వేడి అనేది బయటకు విడుదల అవ్వదు. దీంతో ఈ ప్రభావం బ్రెయిన్, హార్ట్, మూత్ర పిండాలపై పడుతుంది. ఈ కారణంగా త్వరగా హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఇంజూరి అవ్వొచ్చు. వేసవిలో సిగరెట్ తాగడం వల్ల కలిగే హాని అనేక రెట్లు పెరుగుతుంది. ధూమపానం చేయని వారికి, అంటే పాసివ్ స్మోకర్లకు కూడా ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఏసీ రూమ్‌లో ఉండి స్మోకింగ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్, షుగర్ ప్రాబ్లమ్, లంగ్ ప్రాబ్లమ్, ఒత్తిడి పెరగడం, డిప్రెషన్‌ ఫీల్ అవడం వంటి సమస్యలు కలుగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us