Sweet Corn Pakoda: స్వీట్ కార్న్ పకోడీలు ఇలా వేశారంటే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
స్వీట్ కార్న్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. సీజన్ ఏదైనా సరే ఇవి ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. అలా బయటకు వెళ్లామంటే.. మసాలా స్వీట్ కార్న్ తినాల్సిందే. ఈ స్వీట్ కార్న్‌ని మనం ఏడాది పొడవునా తినవచ్చు. వీటిని ఉడికించి ఉప్పు, కారం, నెయ్యి, నిమ్మకాయ పిండి తింటే.. ఆహా టేస్టే వేరే లెవల్ అంతే. అంత రుచిగా ఉంటాయి. మరి ఇలాంటి స్వీట్ కార్న్‌తో పకోడీలు కూడా తయారు..

స్వీట్ కార్న్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. సీజన్ ఏదైనా సరే ఇవి ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. అలా బయటకు వెళ్లామంటే.. మసాలా స్వీట్ కార్న్ తినాల్సిందే. ఈ స్వీట్ కార్న్‌ని మనం ఏడాది పొడవునా తినవచ్చు. వీటిని ఉడికించి ఉప్పు, కారం, నెయ్యి, నిమ్మకాయ పిండి తింటే.. ఆహా టేస్టే వేరే లెవల్ అంతే. అంత రుచిగా ఉంటాయి. మరి ఇలాంటి స్వీట్ కార్న్‌తో పకోడీలు కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం సాధారణ కార్న్‌తోనే కాకుండా.. స్వీట్ కార్న్ తో కూడా పకోడీలు తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
స్వీట్ కార్న్ పకోడీలు తయారీకి కావాల్సిన పదార్థాలు:
స్వీట్ కార్న్, శనగ పిండి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, కరివేపాకు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం ముక్కలు, జొన్న పిండి, బియ్యం పిండి, ఆయిల్.
స్వీట్ కార్న్ పకోడీలు తయారీ విధానం:
ముందుగా స్వీట్ కార్న్ మొత్తం వలిచి పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీలో వేసి కచ్చా పచ్చా తిప్పి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బియ్యం పిండి, మొక్క జొన్న పిండి, శనగ పిండి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, కరివేపాకు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఓ కడాయి పెట్టి.. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంతో పకోడీల్లా వేసుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకున్నాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ పకోడీలను పుదీనా చట్నీ, టమాటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి.








