ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండి నల్లగా మారకుండా ఉండాలంటే అద్భుతమైన చిట్కాలు!.. ఇలా చేస్తే దూదిలాంటి
మిగిలి పోయినా, ఎక్కువగా తడిపి పెట్టుకున్న పిండిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే రోజులు గడిచే కొద్దీ పిండి రంగు మారుతుంది. దానిపై నల్లటి పొరల ఏర్పడుతుంది. కాబట్టి, పిండి నల్లగా మారకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?

సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీలను ఎక్కువగా తింటుంటారు. అలాంటప్పుడు కొన్ని సార్లు తడిపిన చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో చపాతీ పిండిని తడిపుతున్నప్పుడే… రెండు, మూడు రోజులకు సరిపడా కలిపి పెట్టేసుకునే వాళ్లు కూడా ఉంటారు. అలా మిగిలి పోయినా, ఎక్కువగా తడిపి పెట్టుకున్న పిండిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే రోజులు గడిచే కొద్దీ పిండి రంగు మారుతుంది. దానిపై నల్లటి పొరల ఏర్పడుతుంది. కాబట్టి, పిండి నల్లగా మారకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?
చపాతీ పిండిని తడుపుకుంటున్న టైమ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. పిండి త్వరగా పాడవదు. అంటే పిండిని పిసికేటప్పుడే నీళ్లలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కరిగిన తర్వాత అదే నీటితో పిండిని తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి త్వరగా పాడవదు. నల్లగా కూడా మారదు. ఇలా చేసిన వెంటనే చపాతీ కాల్చుకుంటే మెత్తగా ఉంటుంది. తర్వాత మిగిలిన పిండిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండి మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి?: చాలాసార్లు ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండితో చేసిన రోటీలు మెత్తగా ఉండవు. అలాంటప్పుడు ఈ సమస్యను పరిష్కారించేందుకు ఒక మార్గం ఉంది. అంటే పిండిని పైన రెండు లేదా మూడు చెంచాల నీళ్లు పోసి మూతపెట్టి 10నిమిషాల తర్వాత కాస్త ఎండు పిండితో ముద్దలా చేస్తే చపాతీ మెత్తగా వస్తుంది.
చపాతీ పిండిని ఎక్కువ సేపు నిల్వ ఉంచుకోవడం ఎలా: చపాతీ పిండిని మెత్తగా తడిపి ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కొద్దిగా నూనె పోయాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేస్తే చపాతీ పిండి ఎక్కువ సేపు ఉంటుంది. త్వరగా పాడవదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








