Toothache : పంటి నొప్పికి చక్కని ఔషధం ఈ నూనె.. మరెన్నో లాభాలు..! ఇంట్లోనే చేసుకోవచ్చు
అయితే, ఈ సమస్యని కంట్రోల్ చేసేందుకు కొన్ని హోం రెమిడీస్ బాగా పనిచేస్తాయి. పంటి నొప్పికి మన వంటింట్లో లభించే లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. పంటి నొప్పికి లవంగం నూనె చాలా మంచిది. అందుకే లవంగం నూనె తయారీ, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
Toothache : పంటి నొప్పి..బాబోయ్ కంటికి కనిపించికుండా మనల్ని చంపేస్తుంది. పంటి నొప్పిని అస్సలు తట్టుకోలేం. ఏం తినలేం తాగలేం. పంటి నొప్పి వస్తే దాంతోపాటుగానే తలనొప్పి కూడా వస్తుంది. ఆ బాధ ఎలా ఉంటుందో ఈ సమస్యను ఎదుర్కొన్న వారికే తెలుస్తుంది. అయితే, ఈ సమస్యని కంట్రోల్ చేసేందుకు కొన్ని హోం రెమిడీస్ బాగా పనిచేస్తాయి. పంటి నొప్పికి మన వంటింట్లో లభించే లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. పంటి నొప్పికి లవంగం నూనె చాలా మంచిది. అందుకే లవంగం నూనె తయారీ, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
లవంగం నూనె దంత ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. లవంగం నూనెను దంత చిగుళ్ల దగ్గర రాసుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. దంతక్షయం ఉండదు. ఎందుకంటే ఇందులో ఉండే యూజినాల్ ప్రభావిత ప్రాంతాలకు ఉపశమనం కలిగించడమే కాకుండా ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. లవంగం నూనెలోని క్రిమిసంహారక గుణాలు దంత నొప్పి, పంటి నొప్పి, చిగుళ్లలో పుండ్లు, నోటిపూతలకు కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది.
లవంగాల నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుతాయి. ఈ నూనె రాసుకుంటే దురద తగ్గుతుంది. ఇందులో ఉండే పోషకాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్‌గా పని చేస్తాయి. వివిధ రూపాల్లో లవంగం నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా మారుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె సమస్యలను దూరం చేస్తాయి.
లవంగం ఆయిల్ కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ ఆయిల్‌లో ఉండే సమ్మేళనాలు ఫ్యాటీ లివర్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడతాయి. లవంగం నూనెను వివిధ రూపాల్లో తీసుకోవడంతో ఎముకలు బలంగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఎముకల సాంద్రత పెరుగుతుంది. లవంగం నూనె రాసుకుంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. పొడి చర్మం సమస్య తగ్గుతుంది. లవంగం నూనె రాసుకుంటే కళ్ల కింద చర్మం ఉబ్బడం వంటి సమస్యలు ఉండవు.
ఎలా చేయాలి?: లవంగాలను అవసరమైన మొత్తంలో తీసుకుని బాగా నలగగొట్టి, గాజు పాత్రలో వేసి, లవంగాలు మునిగిపోయేంత ఆలివ్ ఆయిల్ పోసి మూతపెట్టాలి. అప్పుడు ఒక వారం లేదా రెండు రోజులు నేరుగా సూర్యకాంతి పడేలా ఎండలో పెట్టుకోవాలి. ఆపై దానిని వడకట్టండి. లవంగం నూనెను మరొక గాజు పాత్రలో పోయాలి. సూర్యకాంతి తగలకుండా చూసుకోవాలి.
ఎలా ఉపయోగించాలి: లవంగం నూనెలో చిన్న దూదిని ముంచి పంటి నొప్పికి రాయండి.
గమనిక: దీన్ని అతిగా ఉపయోగించడం హానికరం. అలాగే, ఇది శాశ్వత పరిష్కారం కాదు. పంటి నొప్పి తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..