- Telugu News Photo Gallery Curd and ashwagandha mixture turn yellow teeth into whiten Telugu Lifestyle News
పెరుగులో ఈ పదార్థాన్ని కలిపి రాసుకుంటే పసుపు పళ్లు ముత్యాల్లా మెరుస్తాయి..!
ముత్యాల లాంటి తెల్లటి దంతాలు కావాలని ఎవరికుండదు? అవి నోటి ఆరోగ్యానికి సంకేతమే కాకుండా మనకి సౌందర్యాన్ని కూడా అందిస్తాయి. కానీ, తెల్లగా మెరిసే పళ్లపై పట్టిన పసుపు పొర క్రమంగా పేరుకుపోతుంది. ఈ పసుపు దంతాల కారణంగా ప్రజలు నవ్వడానికి సిగ్గుపడతారు. కొంతమంది రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకున్నా పళ్ళ పసుపు రంగు పోదు. అందుకే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి.
Updated on: May 31, 2024 | 1:32 PM

ధూమపానం, మద్యపానం, తరచుగా టీ-కాఫీ అలవాటు వంటి దంతాల పసుపు రంగుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ మొండి పసుపు రంగును శుభ్రం చేయడానికి మీరు రెండు సహజ ఉత్పత్తులను మిక్స్ చేసి దంతాల మీద అప్లై చేయడం వల్ల పసుపు దంతాలు త్వరగా తొలగిపోతాయి.

చిటికెడు అశ్వగంధ చూర్ణంలో ఒక చెంచా పెరుగు కలిపి దంతాల మీద రాస్తే పసుపు దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి. ఈ అశ్వగంధ పొడిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పంటి నొప్పిని తగ్గిస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

Teeth

ఆయిల్ పుల్లింగ్ అనేది మీరు కొబ్బరి నూనెను మౌత్ వాష్‌గా ఉపయోగించాల్సిన పద్ధతి. దంతాలపై ఏర్పడిన పసుపు పొరను తొలగించడంలో ఆయిల్ పుల్లింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ఇకపోతే, అతి ముఖ్యమైన విషయం.. నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజూ మీ దంతాలను బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం చాలా అవసరం. దంతాల పసుపు రంగును నివారించడానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి. మీ దంతాలను ప్రతిరోజూ బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం ద్వారా ఎనామిల్‌ను రక్షించుకోవచ్చు. పైగా మరకలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.




