Ajinomoto: అజినోమోటో.. ఫాస్ట్‌ ఫుడ్‌ లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? జాగ్రత్త!

ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ను బాగా ఇష్టపడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ లో అజినమోటో అనే సాల్ట్ లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఆహారాలకు మరింత ప్రత్యేక రుచిని అందించటం కోసం అజిన్‌మోటోను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ajinomoto: అజినోమోటో.. ఫాస్ట్‌ ఫుడ్‌ లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? జాగ్రత్త!
Ajinomoto
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 02, 2024 | 9:34 AM

అజినోమోటో…దీనినే చైనా ఉప్పు అని కూడా పిలుస్తారు. రుచి కోసం అనేక వంట‌ల్లో అజినోమోటో విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు. చైనా నుంచి దిగుమతి అయిని ఈ ఉప్పు.. మ‌న దేశంలో సైతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బ‌య‌ట దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌లో అజినోమోటోను రుచి, వాస‌న‌ కోసం విప‌రీతంగా వాడుతుంటారు. ఆధునిక జీవనశైలిలో మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. అలాంటి ఆహారాలకు మరింత ప్రత్యేక రుచిని అందించటం కోసం అజిన్‌మోటోను ఉపయోగిస్తుంటారు. ఇక ఇప్పుడిది మనందరి వంట గదుల్లోకి కూడా వ‌చ్చేసింది. అయితే,  వంట‌ల‌కు రుచి పెంచే ఈ అజినోమోటో వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అజినోమోటో అంటే ఏమిటి?: అజినోమోటో ఒక రకమైన రసాయనం. దీనినే MSG అని కూడా అంటారు. MSG అనేది మోనోసోడియం గ్లుటామేట్. ఇది ప్రొటీన్‌లో భాగం. దీనిని అమినో యాసిడ్ అని కూడా అంటారు. అజినోమోటోను 1909లో జపనీస్ శాస్త్రవేత్త కికునావో అకెడా కనుగొన్నారు.

అజినోమోటో ఎలాంటి ఆహారంలో ఉపయోగిస్తారు?: నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, సూప్ వంటకాలు వంటి చాలా చైనీస్ వంటకాలలో అజినోమోటోను ఉపయోగిస్తారు. అలాగే, దీనిని పిజ్జా, బర్గర్, మ్యాగీ మసాలాలు, జంక్ ఫుడ్, టొమాటో సాస్, సోయా సాస్, చిప్స్‌లో కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు Ajinmoto తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

ఇవి కూడా చదవండి

నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది: చైనీస్ వంటకాల్లో ఉపయోగించే అజినోమోటో నాడీ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. ఇందులోని గ్లుటామిక్ యాసిడ్ మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఎక్కువగా ఉంటే మెదడుకు ప్రమాదం ఏర్పడుతుంది.

బరువు పెరగడం: నేడు చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. రెండో విషయం ఏమిటంటే నేటి ఆహారపు అలవాట్లు దిగజారిపోయాయి. కరకరలాడే ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, అజినోమోటో మీ ఆకలిని పెంచుతుంది. దీనివల్ల పదే పదే తినడం వల్ల ఊబకాయం వస్తుంది.

గర్భిణీ స్త్రీలకు ప్రమాదం: గర్భిణీ స్త్రీలు చైనీస్ ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. దీనికి ప్రధాన కారణం అజినోమోటో. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. ఇది శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది.

అధిక రక్తపోటు సమస్య: చైనీస్ ఆహారంలో అజినోమోటో రక్తపోటు సమస్యను కలిగిస్తుంది. బహుశా, మీరు ఇప్పటికే రక్తపోటు పేషెంట్ అయితే, అజినోమోటో ఫుడ్ తినకండి. దీని వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది.

నిద్రలేమి, మైగ్రేన్లు: మీకు నిద్ర, మైగ్రేన్ సమస్యలు ఉంటే అజినోమోటో ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇది నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అజినోమోటో ఫుడ్ తినడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో