AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండి నగలు, పాత్రలు నల్లబడ్డయా.. శుభ్రం చేసుకోవడానికి సింపుల్ టిప్స్ మీ కోసం..

ప్రతి ఇంట్లో వెండి నగలు, పాత్రలు, ఇలా ఏదోక రూపంలో వెండి వస్తువులు ఇంట్లో చోటుని సంపాదించుకున్నాయి. అయితే ఈ వెండి వస్తువులు పాతబడిన కొద్దీ వాటి రంగు నల్లగా మారుతుంది. పండుగలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో అవసరమైనప్పుడు ఈ వెండి వస్తువులను శుభ్రం చేయడం కష్టంగా మారుతుంది. అయితే ఇంట్లో ఉపయోగించే వస్తువులను ఉపయోగించి సింపుల్ టిప్స్ తో వెండి వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. ఈజీగా మెరిసేలా చేయవచ్చు.

వెండి నగలు, పాత్రలు నల్లబడ్డయా.. శుభ్రం చేసుకోవడానికి సింపుల్ టిప్స్ మీ కోసం..
Silver Jewellery
Surya Kala
|

Updated on: Jun 04, 2024 | 12:32 PM

Share

భారతీయులకు ఇష్టమైన లోహల్లో బంగారం తర్వాత స్థానం వెండికి దక్కుతుంది. కొన్ని ఇళ్ళల్లో వెండి గిన్నెలు, కంచాలు, గ్లాసులను ఆహారం తీసుకోవడానికి ఉపయోగిస్తే.. చాలా మంది వెండి వస్తువులను పూజ కోసం ఉపయోగిస్తారు. ఇక పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెండి వస్తువులను బహుమతులుగా ఇస్తారు. అయితే ఒకానొక సమయంలో వెండి పట్టీలు కడియాలు వంటి వాటిని ధరించేవారు.. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు వెండి వస్తువులు కూడా బాగా ఆదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రతి ఇంట్లో వెండి నగలు, పాత్రలు, ఇలా ఏదోక రూపంలో వెండి వస్తువులు ఇంట్లో చోటుని సంపాదించుకున్నాయి. అయితే ఈ వెండి వస్తువులు పాతబడిన కొద్దీ వాటి రంగు నల్లగా మారుతుంది. పండుగలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో అవసరమైనప్పుడు ఈ వెండి వస్తువులను శుభ్రం చేయడం కష్టంగా మారుతుంది. అయితే ఇంట్లో ఉపయోగించే వస్తువులను ఉపయోగించి సింపుల్ టిప్స్ తో వెండి వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. ఈజీగా మెరిసేలా చేయవచ్చు.

టూత్ పేస్ట్ : వెండి పాత్రలు లేదా ఆభరణాలు తళతళలా మెరవాలంటే తెల్లటి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఆభరణాలు, పాత్రలపై టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి అనంతరం బ్రష్‌తో శుభ్రం చేయాలి. అప్పుడు ఆ వస్తువులను వేడి నీటిలో ముంచి కాసేపు అలాగే ఉంచాలి. నీటి నుంచి బయటకు తీసిన తర్వాత మరోసారి బ్రష్‌తో మిగిలిన మురికిని శుభ్రం చేసి సాధారణ నీటితో కడిగి పొడి బట్టతో మరకలు లేకుండా తుడవాలి.

టొమాటో సాస్ : ఇంట్లో స్నాక్స్ కు అదనపు రుచిని అందించడం కోసం టొమాటో సాస్‌ను జత చేసుకుని తింటారు. అయితే ఈ టమాటా సాస్ వెండి పాత్రలు, ఆభరణాలను మెరిసేలా చేస్తుంది. వెండి వస్తువులపై టొమాటో సాస్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత మెత్తని బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగి, పొడి గుడ్డతో తడి లేకుండా శుభ్రంగా తుడవాలి.

ఇవి కూడా చదవండి

వెనిగర్: వెండి ఆభరణాలు లేదా పాత్రలను శుభ్రం చేయడానికి కూడా వెనిగర్ ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో వెనిగర్ తీసుకుని దానిలో ఉప్పు వేసి.. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తర్వాత ఆ మిశ్రమంలో వెండి పాత్రలు లేదా ఆభరణాలను మునిగేలా పెట్టుకోవాలి. సుమారు 20 నుండి 25 నిమిషాల తర్వాత ఆ వెండి వస్తువులను మిశ్రమం నుంచి తీసి వేడి నీటితో శుభ్రం చేయండి. తర్వాత మరకలు లేకుండా పొడి బట్టతో తుడవాలి.

నిమ్మరసం, ఉప్పు: వెండి పాత్రలు, ఆభరణాల నలుపు పోవాలంటే నిమ్మకాయ ముక్కపై ఉప్పు రాసి రుద్దితే శుభ్రం చేసుకోవచ్చు. ఇది కాకుండా వేడి నీటిని తీసుకుని అందులో ఒకటి లేదా రెండు నిమ్మకాయల రసాన్ని కలపండి. దీని తర్వాత రెండు చెంచాల ఉప్పు వేసి వెండి వస్తువులను ఈ నీటిలో ముంచి కాసేపు అలాగే ఈ నీటిలో పాత్రలను ఉంచండి. వీటిని బయటకు తీసి శుభ్రం చేసి పొడి బట్టలతో శుభ్రం చేసి ఆరబెట్టాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..